నోకియా సి21 ప్లస్ ఇండియాలో లాంచ్: ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

నోకియా సి21 ప్లస్ ఇండియాలో లాంచ్: ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
HIGHLIGHTS

నోకియా సి సిరీస్ నుండి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చింది

నోకియా సి21 ప్లస్ ను ఇండియాలో విడుదల చేసింది

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తో వస్తుంది

నోకియా సి సిరీస్ నుండి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ నోకియా సి21 ప్లస్ ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తో వస్తుంది మరియు వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు  తెలుసుకోవాల్సిన అన్ని విషయాలను క్రింద చూడవచ్చు.

నోకియా సి21 ప్లస్: ధర

నోకియా సి21 ప్లస్ స్మార్ట్ ఫోన్ 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.10,299 రూపాయల ధరతో, 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.11,299 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ తో నోకియా వైర్డ్ బడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు కూడా కంపెనీ ప్రకటించింది.

 నోకియా సి21 ప్లస్: స్పెక్స్

ఈ నోకియా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5-అంగుళాల HD+ డిస్ప్లేని కలిగివుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 2.5D గ్లాస్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc SC9863A ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు గరిష్టంగా 4GB RAM మరియు 64GB స్టోరేజ్ తో జత చేయబడింది. ఒక డేడికేటెడ్ మెమోరీ కార్డ్ తో స్టోరేజ్ ను మరింతగా విస్తరించవచ్చు.

కెమెరాల పరంగా, నోకియా సి21 ప్లస్ వేణుపై డ్యూయల్ కెమెరాలతో వస్తుంది. ఇందులో, ప్రైమరీ 13-మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ ఉన్నాయి. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. ఈ ఫోన్ దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP52 రేట్ చేయబడింది. ఈ ఫోన్ సాధారణ 10W ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద బ్యాటరీతో వస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo