జియోఫోన్ 2021 అఫర్: రెండు సంవత్సరాల టోటల్ అన్లిమిటెడ్ సర్వీస్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 27 Feb 2021
HIGHLIGHTS
  • రిలయన్స్ జియో కొత్త జియోఫోన్ 2021 ఆఫర్

  • టోటల్ అన్లిమిటెడ్ సర్వీస్ తో ప్రకటించింది.

  • ఒకేసారి 24 నెలల అన్లిమిటెడ్ సర్వీస్

జియోఫోన్ 2021 అఫర్: రెండు సంవత్సరాల టోటల్ అన్లిమిటెడ్ సర్వీస్
జియోఫోన్ 2021 అఫర్: రెండు సంవత్సరాల టోటల్ అన్లిమిటెడ్ సర్వీస్

రిలయన్స్ జియో కొత్త జియోఫోన్ 2021 ఆఫర్ ను రెండు సంవత్సరాల టోటల్ అన్లిమిటెడ్ సర్వీస్ తో ప్రకటించింది. భారత్ దేశంలో ఇంకా 2G వాడుతున్న వినియోగదారులకు 4G సర్వీస్ ను అందించే ప్రయత్నంలో భాగంగా ఈ అఫర్ విడుదల చేసినట్లు జియో సంస్థ ప్రకటించింది. అంతేకాదు, ఇందులో కేవలం కొత్త జియోఫోన్ కోణాలను కునే వారికి మాత్రమే కాకుండా ఇప్పటికే జియోఫోన్ ను వాడుతున్న కస్టమర్ల కోసం కూడా ఈ ఒక ప్లాన్ ని అందించింది.ఈ అఫర్ విశేషాలు ఏమిటో చూద్దాం.              

జియోఫోన్ 2021 ఆఫర్

అతిపెద్ద  టెలికాం ఆపరేటర్ జియో తన జియోఫోన్ ను ఒకేసారి 24 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా, ఈ అఫర్ ఎంచుకునే కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు 2 జిబి హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. అయితే, దీని కోసం రూ .1,499 చెల్లించాల్సి ఉంటుంది.  

పైన తెలిపిన ఈ ప్రయోజనాలను కేవలం రెండు సంవత్సరాలకు మాత్రమే కాదు, రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీని కోసం, చందాదారులు సింగిల్ పేమెంట్ గా రూ .1,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో, జియోఫోన్ మరియు 12 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. ఇందులో, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు 2 జిబి హై-స్పీడ్ డేటా ఉంటాయి. రోజువారీ ఉపయోగం కోసం.

అదనంగా, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారుల కోసం కూడా ఒక ప్లాన్ ప్రకటించింది. దీనితో, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారులు సంవత్సరానికి 2GB రోజువారీ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఇవన్నీ కూడా మరింత కేవలం 749 రూపాయల అఫర్ ధరకే  పొందవచ్చు. అయితే, ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఇప్పటికే ఉన్న JioPhone నంబర్లలో మాత్రమే ఈ ప్లాన్ యాక్సెస్ చేయబడుతుంది.

logo
Raja Pullagura

email

Web Title: new jiophone 2021 offer bundled with unlimited services
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status