New AC Rules : ఏసీల వాడకంపై కొత్త రూల్స్ అనౌన్స్ చేసిన ప్రభుత్వం.!
ఏసీల వాడకంపై ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది
ఈ కొత్త రూల్స్ అమలు చేయడానికి యోచిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది
అయితే, దీనిపై ప్రజలు రెండు రకాల భావాలు వ్యక్తం చేస్తున్నారు
New AC Rules: ఏసీల వాడకంపై ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో అతిగా పెరిగిన ఏసీల వాడకం మరియు దాని వలన ఇప్పటికే కలిగిన ఇకముందు కలిగే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త రూల్స్ అమలు చేయడానికి యోచిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, దీనిపై ప్రజలు రెండు రకాల భావాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త ఆంక్షలు లేదా రూల్స్ పర్యావరణానికి మంచిది అని కొందరు అంటుంటే, తమ వస్తువులపై స్వేచ్ఛను కూడా ప్రభుత్వం హరిస్తోందని కొందరు అంటున్నారు.
SurveyNew AC Rules: ఏమిటా కొత్త రూల్స్?
దేశంలో ఏసీల వాడకం తారాస్థాయికి చేరుకుంది. వలన పవర్ గ్రిడ్ లతో పాటు పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బ తింటున్నట్లు చెబుతూ ఈ కొత్త ఏసీ రూల్స్ అనౌన్స్ చేశారు. అదేమిటంటే, ఇక నుంచి ఏసీ లను 20 నుంచి 28 డిగ్రీల వరకు మాత్రమే సెట్ చేసుకునే అవకాశం ఉంటుందని మరియు దాని కోసం దిశ నిర్దేశాలు చేయడానికి కసరత్తు చేస్తునట్లు, హొసింగ్ మరియు అర్బన్ ఆఫర్స్ యూనియన్ మినిస్టర్, మనోహర్ లాల్ ఖట్టర్ ఒక ప్రకటన చేశారు.

దేశంలో విపరీతంగా పెరిగిన ఉష్టోగ్రతలతో దేశం నిప్పుల కొలిమిగా మారింది. దక్షిణాదిన ఎండలు మరియు వేడి గాలులు సహజమే. అయితే, సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉన్న ఉత్తరాదిన కూడా ఈ వేడి గాలులు చుట్టూ ముట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా, ఢిల్లీ వంటి ప్రధాన మెట్రో నగరాల్లో పెరిగిన ఏసీల వాడకం మరియు వాటిని విచక్షణా రహితంగా టెంపరేచర్ లను తగ్గిండం వంటివి ఎటువంటి పరిణామాలకు దారి తీసేలా చేసినట్లు చెబుతున్నారు. ఇండియా మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ (IMD) ప్రకటించిన ఢిల్లీ ఆరెంజ్ అలర్ట్ తో ఈ విషయాన్ని మరింత సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడానికి యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: అతి భారీ డిస్కౌంట్ తో రూ. 2,999 కే లభిస్తున్న జెబ్రోనిక్స్ పవర్ ఫుల్ Soundbar
ఏమిటి ఈ చర్య ప్రయోజనం?
ఏసీ మినిమం టెంపరేచర్ ను 20 డిగ్రీలకు డిఫాల్ట్ గా సెట్ చేయడం ద్వారా పవర్ సేవింగ్ అవ్వడమే కాకుండా గ్రిడ్ ల పై భారం తగ్గుతుంది. అంతేకాదు, ఏసీలు బయటకు విడుదల చేసే వేడి గాలుల వేడిమి కూడా వాతావరణంలో తక్కువగా ఉంటుంది. వాస్తవానికి, ప్రస్తుత ఏసీల మినిమం టెంపరేచర్ 16 డిగ్రీలు ఉంది. అయితే, కొత్త రూల్స్ కనుక పూర్తి స్థాయిలో వాడుకలోకి వస్తే ఈ అవకాశం ఉండదు. రానున్న యూదు సంవత్సరాలలో ఈ చర్య ద్వారా దాదాపు 15 వేల కోట్ల రూపాయల వరకు పావుర సేవింగ్ ను చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నిజానికి, అధికంగా ఏసీల వాడకం గ్లోబల్ వార్మింగ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ చర్యతో గ్లోబల్ వార్మింగ్ తగ్గించే దిశగా చర్యలు తీసుకున్న దేశాల్లో భారత్ కు మంచి స్థానం దక్కే అవకాశం ఉంటుంది అయితే, ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వం ఈ కొత్త రూల్స్ ను పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకు వచ్చినప్పుడు మాత్రమే జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.