LPG యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో నుంచే Biometric Aadhaar e-KYC అప్డేట్ చేసుకోండి.!

HIGHLIGHTS

వంట గ్యాస్ కోసం ఏర్పడిన కొరత మరియు ముందు జాగ్రత్త దృష్ట్యా ప్రభుత్వం కూడా కొత్త రూల్స్ తెచ్చింది

మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఈ ముఖ్యమైన డిజిటల్ అప్‌డేట్ తీసుకొచ్చింది

యూజర్లు ఎల్​పీజీ గ్యాస్ కనెక్షన్ ను Biometric Aadhaar e-KYC తో అప్‌డేట్ చేసుకోవాలి

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ మరియు LPG కోసం ఇక్కట్లు పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎల్​పీజీ గ్యాస్ కోసం ఎక్కువగా ఆంక్షలు విధించారు. వంట గ్యాస్ కోసం ఏర్పడిన కొరత మరియు ముందు జాగ్రత్త దృష్ట్యా ప్రభుత్వం కూడా కొత్త రూల్స్ తెచ్చింది. ఇప్పుడు గ్యాస్ కోసం కొత్త అప్‌డేట్ కూడా అందించింది. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఈ ముఖ్యమైన డిజిటల్ అప్‌డేట్ తీసుకొచ్చింది. అదేమిటంటే, యూజర్లు ఎల్​పీజీ గ్యాస్ కనెక్షన్ ను Biometric Aadhaar e-KYC తో అప్‌డేట్ చేసుకోవాలి. ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ అప్‌డేట్ ను ఇంటి వద్ద నుంచే చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

LPG Biometric Aadhaar e-KYC

ఎల్​పీజీ కొత్తగా తెచ్చిన బయోమెట్రిక్ ఆధార్ వినియోగదారులు ఈ విధానాన్ని పూర్తి చేస్తే ప్రభుత్వ సబ్సిడీ మరియు ఇతర సేవలు నిరంతరంగా అందుతాయి. ఈ ప్రక్రియను యూజర్లు తమ ఇంటి నుంచే స్మార్ట్‌ ఫోన్ ద్వారా చాలా సులభంగా పూర్తి చేయవచ్చు. ముఖ్యంగా, ఈ కొత్త విధానం ద్వారా యూజర్లు గ్యాస్ ఏజెన్సీ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫేస్ స్కాన్ టెక్నాలజీ సహాయంతో e-KYC పూర్తి చేయవచ్చు.

యూజర్ ఆధార్ నెంబర్ ద్వారా అందించే ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటారు. ఈ ప్రక్రియలో యూజర్ యొక్క గుర్తింపును ఫేస్ రికగ్నిషన్ లేదా ఇతర బయోమెట్రిక్ డేటా ద్వారా ధృవీకరిస్తారు. ఇలా యూజర్లు వారి ఆధార్ నెంబర్ తో బయోమెట్రిక్ e-KYC ని పూర్తి చేస్తే ప్రభుత్వ సబ్సిడీ మరియు ఇతర సేవలు నిరంతరంగా లభిస్తాయి.

Also Read: OnePlus Nord 6: అప్ కమింగ్ నార్డ్ ఫోన్ కోసం టీజర్ రిలీజ్ చేసిన వన్ ప్లస్.!

LPG Biometric Aadhaar e-KYC ఎలా చేయాలి?

ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మూడు స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇందులో మొదటిది www.pmuy.gov.in/e-kyc.html అధికారిక e-KYC పేజీకి వెళ్లాలి. మెయిన్ పేజీ లో HP gas, Indane Gas మరియు Bharat Gas మూడింటిలో మీరు ఉపయోగించే గ్యాస్ యొక్క యాప్ ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తర్వాత యాప్‌ లో అందించిన సూచనల ద్వారా Face Scan చేయడం ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ ను పూర్తి చేయవచ్చు.

అయితే, ఇది పూర్తి చేయడానికి మీ ఫోన్ లో ఆధార్ FaceRD యాప్ ను కలిగి ఉండాలి. ఒకవేళ మీ ఫోన్ లో ఆధార్ FaceRD యాప్ లేకుంటే, ఆ యాప్ ను కూడా డౌన్ లోడ్ చేసుకోవాలి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఈ బయోమెట్రిక్ ఆధార్ e-KYC పూర్తి చేయడం తప్పనిసరి. ఇది పూర్తి చేస్తే LPG రీఫిల్‌పై రూ. 300 వరకు టార్గెట్ సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది.

మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది కచ్చితంగా చేయాలనీ ప్రభుత్వం సూచించలేదు. ఈ e-KYC అప్డేట్ చేయకపోయినా గ్యాస్ సరఫరా ఆగదు. కానీ సబ్సిడీ పై ప్రభావం ఉండవచ్చని చెబుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :