new No Reply scam circulating be careful and know how prevent
సీజన్ మారితే చాలు స్కామర్లు కొత్త స్కామ్ తో విరుచుకు పడతారు. నిన్న మొన్నటి వరకు కాల్ స్కామ్ మరియు ఫేక్ లింక్స్ తో అకౌంట్ లను కొల్లగొట్టిన స్కామర్లు ఇప్పుడు కొత్త స్కామ్ కి తెరలేపారు. అన్నింటిని అరచేతిలో చక్కబెట్టే స్మార్ట్ ఫోన్ ఇలాంటి స్కామ్ లకు కూడా నెలవై ఉంటుంది. ఇటీవల వార్తల్లో చర్చకు వచ్చిన ‘No Reply’ వాట్సాప్ స్కామ్ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ స్కామ్ కోసం OTP కూడా అవసరం ఉండదు.
స్కామర్లు ముందు ‘మీ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 70,000 డెబిట్ అయ్యాయి’ అని మెసేజ్ పంపుతారు. తర్వాత, ‘ఒకవేళ ఈ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే ‘NO’ అని రిప్లై ఇవ్వండి’, అని మెసేజ్ పంపిస్తారు. మీరు ఈ మెసేజ్ నిజమైనదే అని నమ్మి వెంటనే నో అని రిప్లై ఇచ్చారనుకోండి వెంటనే మీ అకౌంట్ లో ఉన్న సొమ్ము లూటీ చేస్తారు. ఇది ఈ స్కామ్ పై ఇచ్చిన రిపోర్ట్. సైబర్ కేటుగాళ్లు పన్నిన అత్యంత ప్రమాదకరమైన ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్ ఇది, అని పోలీస్ డిపార్ట్ తెలిపింది.
రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ వాట్సప్ కి కూడా ఇలాంటి ఒక మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ కు నో అని రిప్లై ఇచ్చిన తర్వాత ఆయన రెండు బ్యాంక్ ఖాతాల నుంచి మొత్తం రూ.1.70 లక్షల రూపాయలు పోయినట్లు వార్తలు తెలిపాయి. ఈ ఘటన పై దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.
నిజానికి కూడా ఇలాంటి ఒకరు చేయని పేమెంట్ ని చూస్తే సహజంగానే భయం కలుగుతుంది. నేను చేయని పేమెంట్ ఎలా జరిగిందని డౌట్ వచ్చినా జస్ట్ నో రిప్లై ఇచ్చి ఆ పేమెంట్ ని ఆపవచ్చనే కంగారులో ఇలా స్పందించే అవకాశం ఉంటుంది. ఇదే భయాన్ని ఆసరాగా చేసుకుని స్కామర్లు డబ్బు కాజేస్తున్నారు.
No Reply ఇస్తే నిజంగానే డబ్బులు పోతాయా? ఇదే ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న మిలియన్ డాలర్ ప్రశ్న. నిజానికి, వాట్సాప్ లో కేవలం ‘నో’ అని రిప్లై ఇచ్చినంత మాత్రాన బ్యాంక్ ఖాతాలోని డబ్బు ఆటోమేటిక్ గా మాయమవుతుందని నిర్ధారించే ఆధారాలు లేవు. ఆ వ్యక్తి ఖాతా నుంచి డబ్బు ఎలా బదిలీ అయింది, ఈ ఘటనలో ఇతర సాంకేతిక అంశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు నిర్ధారణ కావలసి ఉంది.
Also Read: ఫ్లిప్ కార్ట్ పండగ సేల్ దెబ్బకి పెద్ద Xiaomi 4K Smart Tv కేవలం 18 వేలకే లభిస్తోంది.!
మీరు చేయని పేమెంట్ జరిగే అవకాశం ఉండదు మరియు మీ అకౌంట్ పేమెంట్ కోసం వాట్సాప్ లో మెసేజ్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి, ఇలాంటి మెసేజ్ వస్తే మీరు అసలు భయపడాల్సిన అవకాశం లేదు.
ఒకవేళ డబ్బులు పోయినట్లు గుర్తిస్తే వెంటనే మీ బ్యాంక్ ను సంప్రదించి, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 కు కాల్ చేయండి. అలాగే, cybercrime.gov.in వెబ్ సైట్ లో కూడా మీరు మీ సమస్య గురించి ఫిర్యాదు చేయవచ్చు.