Noise Master Buds sound by bose got 50 percent price cut
Bose సౌండ్ తో లాంచ్ చేసిన Noise Master Buds పై 50 శాతం ప్రైస్ కట్ అనౌన్స్ చేసింది. ప్రీమియం సెగ్మెంట్ కోసం ప్రీమియం ఫీచర్స్ తో 2025 లో ఈ బడ్స్ ను లాంచ్ చేసింది. మోటోరోలా ఈ ఇయర్ బడ్స్ ను సరికొత్త రూపం మరియు ఫీచర్స్ తో దీన్ని అప్పర్ మిడ్ రేంజ్ ప్రైస్ కేటగిరిలో లాంచ్ చేసింది. అయితే, ప్రస్తుతం ఈ బడ్స్ పై 50 శాతం ప్రైస్ కట్ అనౌన్స్ చేసింది.
నోయిస్ మాస్టర్ బడ్స్ ను ఇండియాలో రూ. 7,999 ప్రైస్ ట్యాగ్ తో గత సంవత్సరం లాంచ్ చేసింది. అయితే, ఈ బడ్స్ ను ఇప్పుడు 50 శాతం ప్రైస్ కట్ తో కేవలం రూ. 3,999 రూపాయల చవక ధరలో సేల్ చేస్తోంది. ఇది కంపెనీ అఫీషియల్ సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ ఇండియా నుంచి కూడా ఇదే ధరలో లభిస్తుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ బడ్స్ ను కేవలం రూ. 3,499 ఆఫర్ ధరలో అందుకోవచ్చు. ఎందుకంటే, ఫ్లిప్ కార్ట్ ఈ బడ్స్ పై ICICI అండ్ SBI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
నోయిస్ ఈ ఇయర్ బడ్స్ ని బోస్ సౌండ్ ఫీచర్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. అయితే, ఇది ఇప్పుడు మరింత బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ బడ్స్ ను 12.4mm PEEK మరియు టైటానియం డ్రైవర్స్ జతగా అందించింది. ఇది గొప్ప సౌండ్ అందించే సెటప్ మరియు ఇది గొప్ప సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. అదనంగా, ఇందులో LHDC 5.0 మరియు స్పేషియల్ సౌండ్ వంటి ఫీచర్లు కూడా ఉండటంతో మరింత గొప్ప సౌండ్ అందిస్తుంది.
ఈ ఇయర్ బడ్స్ లో 49dB అడాప్టివ్ ANC నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అందించింది. ఇది వెలుపలి శబ్దాలు పూర్తిగా తగ్గించి చాలా క్లీన్ ఆడియో అందిస్తుంది. ఇక కాలింగ్ విషయానికి వస్తే, ఈ బడ్స్ 6-mic కలిగి ENC సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫీచర్ తో మంచి క్వాలిటీ కాలింగ్ అవకాశం అందిస్తుంది. ఇది డ్యూయల్ పెయిరింగ్, ఆటో పెయిరింగ్, లో లెటెన్సీ మోడ్ మరియు ఆటో ఇయర్ డిటెక్షన్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: కేవలం No Reply తో అకౌంట్ ఖాళీ చేస్తున్న స్కామర్లు .. దడ పుట్టిస్తున్న కొత్త స్కామ్.!
ఇది కాకుండా ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఇది నోయిస్ ఆడియో యాప్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ ను మరింత సౌండ్ కోసం ప్రముఖ ఆడియో బ్రాండ్ బోస్ ప్రత్యేకమైన ఆడియో ఫీచర్ తో ట్యూన్ చేయబడి ఉంటుంది.