OnePlus Nord 6: అప్ కమింగ్ నార్డ్ ఫోన్ కోసం టీజర్ రిలీజ్ చేసిన వన్ ప్లస్.!
OnePlus Nord 6 లాంచ్ కోసం కంపెనీ కొత్తగా టీజర్ విడుదల చేసింది
ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ బ్యానర్ ను విడుదల చేసింది
ఈ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్స్ ఇప్పటికే నెట్టింట్లో దర్శనమిచ్చాయి
OnePlus Nord 6: వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ కొత్తగా టీజర్ విడుదల చేసింది. అమెజాన్ ఇండియా మొబైల్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ బ్యానర్ ను విడుదల చేసింది. వన్ ప్లస్ నార్డ్ 5 ఫోన్ గత సంవత్సరం ఇండియన మార్కెట్లో మంచి అమ్మకాలు సాధించిన వన్ ప్లస్ ఇప్పుడు ఈ ఫోన్ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఫోన్ లాంచ్ కోసం సిద్ధం అయ్యింది.
SurveyOnePlus Nord 6: లాంచ్ డేట్
వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ లాంచ్ కోసం కంపెని టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ టీజర్ పేజీ నుంచి ‘ఎంటరింగ్ ది నార్డ్ ఎరా సూన్’ అని టీజింగ్ చేస్తోంది.ఈ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ అప్ కమింగ్ నార్డ్ ఫోన్ గా అభివర్ణించిన కంపెనీ పేరును మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో త్వరలో లాంచ్ అవుతుందని మాత్రమే కంపెనీ తెలిపింది.

OnePlus Nord 6: ఫీచర్స్
వన్ ప్లస్ నార్డ్ 6 స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ను మాత్రమే కంపెనీ విడుదల చేసింది. అంతకు మించి ఈ ఫోన్ గురించి కంపెనీ ఎటువంటి ఇతర వివరాలు అందించలేదు. ఈ అప్ కమింగ్ ఫోన్ టీజర్ ఇమేజ్ లో ఈ ఫోన్ రియర్ కెమెరా మరియు స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్స్ ఇప్పటికే నెట్టింట్లో దర్శనమిచ్చాయి.
Also Read: Instagram బిగ్ ఫీచర్ కి మంగళం పాడుతున్న Meta .. ఆ ఫీచర్ ఏమిటంటే.!
వన్ ప్లస్ నార్డ్ 6: లీక్డ్ ఫీచర్స్
ఆన్లైన్ లో లీకైన వన్ ప్లస్ నార్డ్ 6 ఫోన్ ప్రకారం, ఈ ఫోన్ 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్ మరియు 165Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ ఫోన్ వేగవంతమైన క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ చిప్ సెట్ తో జతగా 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB UFS 4.1 స్టోరేజ్ కలిగి ఉండే అవకాశం ఉంది.
ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 9000mAh భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉందని మరియు ఈ బి బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి. మొత్తానికి ఈ ఫోన్ ను ఒక శక్తివంతమైన మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్ గా వన్ ప్లస్ విడుదల చేసే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. అయితే, ఈ ఫోన్ అఫీషియల్ స్పెక్స్ మరియు ఫీచర్స్ వచ్చిన తర్వాత ఈ లీక్డ్ స్పెక్స్ లో ఎన్ని నిజం అవుతాయో తెలిసే అవకాశం ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile