CES 2021 నుంచి Lenovo తన Think Reality A3 AR స్మార్ట్ గ్లాస్ లను పరిచయం చేసింది

CES 2021 నుంచి Lenovo తన Think Reality A3 AR స్మార్ట్ గ్లాస్ లను పరిచయం చేసింది
HIGHLIGHTS

CES 2021 ఆన్లైన్ కార్యక్రమం కొనసాగుతోంది.

Lenovo Think Reality A3 AR స్మార్ట్ గ్లాస్ లను పరిచయం చేసింది

A3 AR స్మార్ట్ గ్లాసెస్ 1080p స్టీరియోస్కోపిక్ డిస్ప్లేతో వస్తాయి.

CES 2021 ఆన్లైన్ కార్యక్రమం కొనసాగుతోంది మరియు అన్ని సంస్థలు కూడా తమ కొత్త ప్రోడక్ట్స్ ని పరిచయం చేస్తున్నాయి. Lenovo కూడా ఈ ప్రధాన ఎలక్ట్రానిక్స్ షో నుండి సరికొత్త Lenovo Think Reality A3 AR స్మార్ట్ గ్లాస్ లను పరిచయం చేసింది. లెనోవో CES 2021 లో ఆవిష్కరించిన ఈ AR స్మార్ట్ గ్లాసులు సామాన్యమైనవి కావు, ఇవి 1080p స్టీరియోస్కోపిక్ డిస్ప్లేతో వస్తాయి. ఇది ఒకేసారి 5 వర్చువల్ మోనిటర్లను ప్రదర్శించగలదు.

లెనోవా థింక్ రియాలిటీ A3 AR స్మార్ట్ గ్లాసెస్ యొక్క రెండు వెర్షన్లను లెనోవా రిలీజ్ చేసింది. వీటిలో, పేరుసుచినట్లుగా ఈ రెండు గ్లాసులు పనిచేస్తాయి. లెనోవా యొక్క థింక్ రియాలిటీ A3 PC ఎడిషన్, ఇది PC  లేదా ల్యాప్ టాప్ లకు కనెక్ట్ చేసేలా ఉంటే, థింక్ రియాలిటీ A3 ఇండస్ట్రియల్ ఎడిషన్ సెలెక్టెడ్ మోటోరోలా ఫోన్లతో కనెక్ట్ చేసేలా వుంటుంది. ఈ గ్లాస్ లను వివిధ పరిశ్రమలలో అంతటా పనిని చేసే విధానాన్ని మార్చడానికి ఈ అద్దాలను డెవలప్ చేసినట్లు లెనోవా తెలిపింది.                

lenovo-campaign-thinkreality-a3-hero-image.jpg

 Lenovo Think Reality A3 AR స్మార్ట్ గ్లాసెస్

లెనోవో ఇంటెలిజెంట్ మరియు డివైజ్ గ్రూప్ యొక్క స్ట్రాటజీ మరియు ఎమర్జింగ్ బిజినెస్ వైస్ ప్రసిడెంట్ అయిన జాన్ పెర్ష్కే, వర్చువల్ ప్రదేశాల్లో పనిచేసినా లేదా రిమోట్ యాక్సెస్ కి మద్దత్తు ఇచ్చినా Think Reality A3 AR స్మార్ట్ గ్లాసెస్ కార్మికుల సామర్ధ్యాలను పెంచుతుంది. ఈ AR స్మార్ట్ గ్లాసులు మనం పనిచేసే విధానాన్ని ఎలా మార్చగలవాని ఎవరికి తెలుసు. కానీ, ఇవన్నీ కలగలసి మార్కెటల్కి వచ్చినప్పుడు చూడడానికి ఆసక్తికరంగా వుంటాయని,ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo