Jio 5G Phone కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్.!

Jio 5G Phone కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్.!
HIGHLIGHTS

Jio 5G Phone కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్

రిలయన్స్ జియో తన 5G సర్వీస్ లతో పాటుగా JioPhone 5G

దీపావళి పండుగ కానుకగా జియో G

Jio 5G Phone కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ ఒకటి ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. రిలయన్స్ జియో తన 5G సర్వీస్ లతో పాటుగా JioPhone 5G ను కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి, ఈ దీపావళి పండుగ కానుకగా  జియో G సేవలను ప్రారంబించేదుకు సిద్ధమవుతున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయాలను ఇప్పటి వరకూ మనం విన్నాం, మరొక కొత్త విషయం కూడా JioPhone 5G గురించి ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. అదే, జియోఫోన్ 5G యొక్క అంచనా ధర మరియు ఇతర వివరాలు. మరి కొత్త నివేదికలు Jiophone 5G గురించి చెబుతున్న ఆ కొత్త వివరాల పైన ఒక లుక్ వేద్దామా.

Jiophone 5G (Expected)

జియోఫోన్ 5G ని వివిధ స్క్రీన్ సైజ్, స్పెక్స్ మరియు స్టోరేజ్ అప్షన్లలో జియో తీసుకురావచ్చని భావిస్తున్నారు. అంటే, ఈ JioPhone 5G వేరియంట్స్ ధరలు బడ్జెట్ వినియోగదారులను ఆకర్షించే విధంగా ఉంటాయని ఊహిస్తున్నారు. అయితే, Jio యొక్క మునుపటి ఫోన్‌ లతో పోలిస్తే హార్డ్‌వేర్ మరియు డిజైన్ పరంగా చాలా బిన్నంగా మరియు బిగ్ అప్ గ్రేడ్ లను కలిగి ఉంటాయని ఆ పరిశోధనా సంస్థ అంచనా వేసింది.

అలాగే, Jiophone 5G యొక్క అంచనా ధరలను గురించి కౌంటర్ పాయింట్ రీసెర్చ్ కొంత సంచారాన్ని వెల్లడించింది. దీని ప్రకారం, Jiophone 5G రూ. 8,000 నుండి రూ. 12,000 మధ్య అందుబాటులోకి రావచ్చని తెలిపింది. అయితే, జియో తన 5G ఫోన్ ను 5G నెట్ వర్క్ ను మరింతగా విస్తరించిన తరువాత తీసుకురావడానికి చూస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Jiophone 5G: లీక్డ్ స్పెక్స్

జియోఫోన్ 5జి స్పెక్స్ విషయానికి వస్తే, క్వాల్కమ్ బడ్జెట్ 5G చిప్ సెట్ స్నాప్ డ్రాగన్ 480 5G శక్తితో ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఇది N3, N5, N28, N40 మరియు N78 బ్యాండ్‌లకు మద్దతు ఇస్తుంది. అంటే, ఈ ఫోన్ భారతదేశం అంతటా 5G నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ LCD డిస్ప్లే, 4GB మరియు 32GB స్టోరేజ్ తో ఉంటుంది.

ఈ ఫోన్ పేద్ద 5,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉండవచ్చు. అంటే, గతంలో వచ్చిన Jio Phone Next తో పోలిస్తే పెద్ద మార్పులే ఈ ఫోన్ లో చూడవచ్చు. JioPhone 5G వెనుక 13-మెగాపిక్సెల్ ప్రైమరీ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉండవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo