జియో బెస్ట్ ప్లాన్స్: డైలీ 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్…

జియో బెస్ట్ ప్లాన్స్: డైలీ 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్…
HIGHLIGHTS

jio డైలీ 3GB డేటా ప్రీపెయిడ్ ప్లాన్స్

జియో వినియోగదారులకు 3 జిబి రోజువారీ డేటా

మరికొన్ని ఇతర లాభాలను తీసుకొస్తుంది

స్మార్ట్ టీవీలు, OTT యాప్స్ ద్వారా హై క్వాలిటీ వీడియోలు మరియు ఆన్లైన్ గేమింగ్ వంటి వాటితో రోజురోజుకు డేటా వినియోగం పెరుగుతోంది. అందుకే, ఎక్కువ డేటా అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ ని వినియోగదారులు ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందుకే, జియో అన్ని ప్లాన్స్ కంటే కూడా డైలీ 3GB డేటాని అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ ని వినియోగదారులు ఎక్కువగా రీఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి, ఈ ప్లాన్స్ గురించి చూద్దాం.                   

Jio 3GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్

జియో వినియోగదారులకు 3 జిబి రోజువారీ డేటా పరిమితిని ఇచ్చే 3 ప్లాన్స్ ను కలిగి ఉంది మరియు వ్యాలిడిటీ  కాకుండా మరికొన్ని ఇతర లాభాలను తీసుకొస్తుంది. ఆ బెస్ట్ ప్లాన్స్ ఈ క్రింద చూడవచ్చు.

Jio Rs 401 Plan:

 ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 3 జిబి డేటాను అదనంగా మొత్తం 6 జిబి డేటాను కలగలిపి పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం డేటాను 90 GB డేటాని తీసుకువస్తుంది. ఇది రోజుకు 100 SMS లు, అపరిమిత కాలింగ్ మరియు ఈ ప్యాక్‌తో వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా రూ .399 విలువైన 1 సంవత్సర డిస్నీ + హాట్ స్టార్ చందాకు కూడా యాక్సెస్  పొందుతారు.

Jio Rs 999 Plan

ఈ ప్లాన్ దానితో 84 రోజుల చెల్లుబాటు, రోజుకు 3 జిబి డేటా (చెల్లుబాటు వ్యవధికి మొత్తం 252 జిబి డేటాను ఇస్తుంది), రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందుకుంటారు.    

Jio Rs 349 Plan

ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో, రోజుకు 3 జిబి డేటా (చెల్లుబాటు వ్యవధికి మొత్తం 84 జిబి డేటాను ఇస్తుంది), రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు,అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందుకుంటారు.    

Note: మరిన్ని Jio Best Plans కోసం ఇక్కడ నొక్కండి.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo