Comet Browser: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే బ్రౌజర్ గూగుల్ క్రోమ్ కి ఛాలెంజ్ చేస్తూ Open AI కొత్త కామెట్ బ్రౌజర్ లాంచ్ చేస్తున్నట్లు నెట్టింట్లో వాడివేడిగా చర్చ జరుగుతోంది. అయితే, ChatGPT మాత్రం అటువంటి కొత్త అప్డేట్ ఏమి లేదని Nvidia, Bezos, SoftBank మరియు ఇతర కంపెనీల సారధ్యంలో కొనసాగుతున్న స్టార్టప్ కంపెనీ Perplexity AI ఈ కొత్త బ్రౌజర్ ను లాంచ్ చేస్తున్నట్టు చెబుతోంది.
Survey
✅ Thank you for completing the survey!
Comet Browser ఎవరు నిర్మించారు?
పైన తెలిపిన విధంగా స్టార్టప్ కంపెనీ Perplexity AI ఈ కొత్త కామెట్ బ్రౌజర్ ను అందించింది. ఇది పూర్తిగా AI ఆధారిత మరియు క్రోమ్ బెస్ట్ బ్రౌజర్ గా వచ్చింది. ఇది పేజీలు సమరైజ్ చేసే ఇంటెలిజెంట్ అసిస్టెంట్ AI స్లయిడ్ బార్ తో ఉంటుంది. ఇది ఇమెయిల్స్ సెండ్ చేయడం, వర్క్ ఫ్లో లను మేనేజ్ చేయడం మరియు బుక్ మీటింగ్స్ కూడా నిర్వహించేలా ఉంటుంది.
ఈ కొత్త వెబ్ బ్రౌజర్ చాలా వేగంగా ఉంటుంది మరియు సింపుల్ గా నిర్వచించే విధంగా అందించినట్లు కంపెనీ చెబుతోంది. ఈ కొత్త బ్రౌజర్ లో అడిగిన ప్రశ్నలకు లేదా కోరుకునే వారిని ఒక క్రమపద్ధతిలో సమరైజ్ చేసి అందిస్తుంది. అంతేకాదు, ఇందులో ఫుడ్, వెబ్ బ్రౌజింగ్, ఇమెయిల్, సెర్చ్, వాయిస్ యాక్షన్స్, షాపింగ్ మరియు వీడియో కోసం ప్రత్యేకమైన సపరేట్ ట్యాబ్ లను కూడా కలిగి ఉంటుంది.
ఈ కొత్త బ్రోజర్ ను డౌన్ లోడ్ చేసుకొని ఉపయోగించడానికి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. ప్రస్తుత ఆన్లైన్ జీవితాలకు అవసరమైన అన్ని వివరాలు ఇది వేగవంతంగా అందిస్తుందని కంపెనీ తెలిపింది.
Open AI కొత్త బ్రౌజర్ తెస్తుందా? అని అడిగితే చాట్ జిపిటి నిజమనే చెబుతోంది. ఇప్పుడు మాట్లాడుకుంటున్న కామెట్ బ్రౌజర్ కాకుండా సెపరేట్ AI బ్రౌజర్ తీసుకురావడానికి ఓపెన్ ఎఐ యోచిస్తున్నట్లు ఇది చెబుతోంది. ఇదే కనుక నిజమైతే ఇప్పుడు వాడుకలో ఉన్న బ్రౌజర్ లకు పోటీగా కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే మరింత వేగవంతమైన బ్రౌజర్ లను మనం త్వరలోనే చూసే అవకాశం ఉంటుంది. ఇది ఎలా పని చేస్తుంది మరియు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియటానికి మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.