Fake News మరియు చైల్డ్ పోర్నోగ్రఫీని విస్తరించే Apps ను మూసివేయనున్న భారత ప్రభత్వం
ఇదే జరిగితే, వాట్స్ ఆప్, పేస్ బుక్, గూగుల్, ట్విట్టర్ వంటి ప్లాట్ఫారాలు ఇబ్బందుల్లోపడే అవకాశం.
ముఖ్యాంశాలు:
Survey1. నకిలీ వార్తలను వ్యాప్తి చేసే అనువర్తనాలు మరియు వెబ్సైట్లను దండించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
2. ఇదే జరిగితే, వాట్స్ ఆప్, పేస్ బుక్, గూగుల్, ట్విట్టర్ వంటి ప్లాట్ఫారాలు ఇబ్బందుల్లోపడే అవకాశం.
3. నకిలీ వార్తలను నియంత్రించలేని అనువర్తనాలు మరియు వెబ్సైట్లకు ప్రజల యొక్క యాక్సెస్ ను మూసివేయాలని ప్రభుత్వం చూస్తోంది.
గత రెండు సంవత్సరాల నుండి నకిలీ న్యూస్ ఒక పెద్ద సమస్యగా ఉంది మరియు గడుస్తున్న ప్రతి సంవత్సరంతో, ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా వేదికల ద్వారా మరింత ఎక్కువగా నకిలీ కథలు వెబ్ లో షేర్ చేయబడుతున్నాయి. గత సంవత్సరం, పేస్ బుక్ మరియు గూగుల్ లాంటి సాంకేతిక సంస్థలు తమ AI మరియు యంత్ర అభ్యాస-ఆధారిత విధానాలను తమ వేదికలపై నకిలీ వార్తల వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడేందుకు నియమించాయి. WhatsApp తన ప్లాట్ఫారంపైన ఫార్వార్డెడ్ లేబుళ్లను కూడా ప్రవేశపెట్టింది మరియు మెసేజింగ్ అనువర్తనంపై నకిలీ వార్తల వ్యాప్తిని ఆపడానికి, ప్రజలకు వాటి గురించి అవగాహన కోసం ప్రచారాలను కూడా ప్రారంభించింది. అయినప్పటికీ, ఈ ప్రయత్నాలు అన్నింటి వలన కూడా సోషల్ మీడియా ఎకో సిస్టం నుండి ఈ నకిలీ వార్తలను పూర్తిగా బయటకు పంపలేక పోయాయి.
ఈ నకిలీ వార్తలు మరియు చైల్డ్ పోర్నోగ్రఫీ సమస్యలపై కఠినమైన నిర్ణయాలను తీసుకుంటూ, తప్పుడు కథలు లేదా పిల్లల అశ్లీల వ్యాప్తికి బాధ్యత వహిస్తున్న ఏదైనా అనువర్తనం లేదా వెబ్ సైట్ ను మూసివేయడానికి భారతదేశంలోని ఐటి చట్టాలను సవరించడానికి భారత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నకిలీ వార్తలను మరియు చైల్డ్ పోర్నోగ్రఫీ నియంత్రించలేని ఆప్స్ మరియు వెబ్సైట్లపైన పెనాల్టీ విధించడంతో పాటుగా వాటిని మూసివేయడంతో వాటిని నియంత్రించవచ్చని, దీనికోసం ఐటీ చట్టంలోని సవరణలు కోసం కేంద్రం కోరినట్లు, టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిస్తుంది.
" ఈ విషయం పైన సహకరించడానికి నిరాకరించినట్లయితే, ఈ ఉల్లంఘనల విషయంలో సంస్థలను తీవ్రంగా దెబ్బ తీయడానికి జవాబుదారీతనం మరియు శక్తి అవసరం, " అని సీనియర్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ సవరణ ప్రభావం WhatsApp, ఫేస్ బుక్, గూగుల్, స్నాప్చాట్, టెలిగ్రామ్ మరియు ట్విట్టర్ వంటి వాటికీ, భారతదేశంలో కొన్ని కఠినమైన జరిమానాలు ఎదురవుతున్నాయి.
భారతదేశంలోని ఏ కంప్యూటర్లోనైనా వీటిని ఉత్పత్తి / ప్రసారం చేయబడిన లేదా స్టోర్ చేయబడిన సమాచారాన్ని పర్యవేక్షించడానికి లేదా అడ్డగించేందుకు మరియు మోనిటర్ చేయడానికి, 10 కేంద్ర సంస్థలకు సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం యొక్క సెక్షన్ 69 (1) ను ప్రవేశపెట్టాలని హోం మంత్రిత్వ శాఖ వివరించిన తరువాత, కేవలం కొన్నివారాలలోనే ఇది వచ్చింది. కంప్యూటర్లలో డేటాని పర్యవేక్షించడానికి ఈ సంస్థలను ఆదేశించింది : ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డైరెక్ట్ టాక్స్ సెంట్రల్ బోర్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, R & AW, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ (J & K, నార్త్ ఈస్ట్, అస్సాం) మరియు పోలీసు కమిషనర్, ఢిల్లీ.