Mock Drill : మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న భారత్.. మీ ఫోన్ లో అలర్ట్ ఇలా సెట్ చేసుకోండి.!
భారత ప్రభుత్వం సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది
Mock Drill Alert రేపు నిర్వహిస్తోంది
7 రాష్ట్రాల్లోని ప్రజలకు ఎయిర్ సైరన్ మరియు అలర్ట్ సైరన్ ను రేపు నిర్వహిస్తుంది
Mock Drill : భారత్ మరియు పాక్ ఇరుదేశాల మధ్య చెలరేగిన యుద్ధ వాతావరణం దృశ్య, భారత ప్రభుత్వం సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. ముందుగా యుద్ధ ప్రభావానికి గురయ్యే ప్రాంతాలుగా గుర్తించిన ఏరియాలలో ముందుగా రేపు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. 7 ఉత్తర రాష్ట్రాలు ఈ యుద్ధ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఈ 7 రాష్ట్రాల్లోని ప్రజలకు ఎయిర్ సైరన్ మరియు మొబైల్ ఫోన్ అలర్ట్ సైరన్ ను రేపు నిర్వహిస్తుంది. దేశంలో ఎక్కడైనా ఈ మాక్ డ్రిల్ కోసం మీ మొబైల్ లో అలర్ట్ నోటిఫికేషన్ ను మీరే ఈజీగా సెట్ చేసుకోవచ్చు.
SurveyMock Drill Alert:
కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి తో పాకిస్తాన్ మరియు భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు కూడా ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం మరింత తారాస్థాయికి చేరుకుంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వేళ అనుకోని పరిస్థితులు ఎదురైతే ప్రజలు ఎలా స్పందించాలో తెలియ చేసే మాక్ డ్రిల్ ను నిర్వహించడానికి పూనుకుంది.

దేశంలోని ప్రతి ఒక్కరు కూడా తమ మొబైల్ ఫోన్ లో ఎమర్జెన్సీ అలర్ట్ నోటిఫికేషన్ ను ఎనేబుల్ చేసుకోవాలని, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) సూచించింది. దీనికి సంబంచింది ముందుగా ప్రభావిత 7 రాష్ట్రాల్లోని 244 సివిల్ డిఫెన్స్ జిల్లాలో మాక్ డ్రిల్ ను నిర్వహిస్తోంది. అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలియ చేయడమే ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశ్యం, అని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తెలిపింది.
ఎటువంటి అలర్ట్ సిస్టం ఉపయోగిస్తారు?
కొన్ని నివేదికల ప్రకారం, రేపు దేశవ్యాప్తంగా జరుగుతున్న మాక్ డ్రిల్ మరియు ఎమర్జెన్సీ అలర్ట్ నోటిఫికేషన్ కోసం 5G-ఆధారిత సెల్ బ్రాడ్ కాస్ట్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టం ను టెస్ట్ చేస్తుంది. ఇది సాధారణ SMS అలర్ట్ మాదిరిగా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ కొత్త సిస్టం ను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ (DoT) మరియు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) జతగా రూపొందిచారు.
ఈ కొత్త అలారమ్ సిస్టం మొబైల్ నెంబర్ తో పని లేకుండా ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న అన్ని మొబైల్ ఫోన్ లలో అందుతుంది. ఫోన్ DND (డు నాట్ డిస్టర్బ్) మోడల్ లో ఉన్నా కూడా ఈ అలర్ట్ పని చేస్తుంది. అంతేకాదు, ఈ అలర్ట్ 5G మరియు 4G రెండు నెట్ వర్క్ లలో పని చేస్తుంది.
Also Read: Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 28 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart Tv
ఫోన్ లో ఈ అలర్ట్ ను ఎలా సెట్ చేసుకోవాలి?
ఈ సెట్టింగ్ ను ఆండ్రాయిడ్ ఫోన్ లో సెట్ చేసుకోవడానికి, ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి “సేఫ్టీ & ఎమెర్జెన్సీ” ట్యాబ్ లోకి వెళ్ళాలి. లేదా సెట్టింగ్స్ సెర్చ్ బార్ లో నేరుగా ‘వైర్లెస్ ఎమెర్జెన్సీ అలర్ట్’ అని సెర్చ్ చేయాలి. ఈ సెట్టింగ్ లోకి వెళ్లిన తర్వాత ఇది ఎనేబుల్ చేయాలి.
ఈ సెట్టింగ్ ను ఐఫోన్ లో సెట్ చేసుకోవడానికి, ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి నోటిఫికేషన్ ట్యాబ్ ఎంచుకోవాలి. ఇక్కడ ఫోన్ స్క్రోల్ చేసి అడుగున ఉండే గవర్నమెంట్ అలర్ట్స్ ను ఎనేబుల్ చేసుకోవాలి.
ఇలా చేయడం వలన ఏదైనా అనుకోని పరిస్థితి ఏర్పడినప్పుడు ఎమర్జెని అలర్ట్ పేరుతో ఫుల్ స్క్రీన్ అలారం మోగే అవకాశం ఉంటుంది.