Apple ఈరోజు కొత్త iMac 24 Inch ను పవర్ ఫుల్ M4 Chip తో లాంచ్ చేసింది. కేవలం ఈ చిప్ సెట్ మాత్రమే కాదు ఈ ఐమ్యాక్ ను యాపిల్ ఇంటెలిజెన్స్ తో లాంచ్ చేసింది. ఈ కొత్త సిస్టం ను పూర్తిగా ప్రీమియం ఫీచర్స్ మరియు అఫ్ కోర్స్ ప్రీమియం ధరలో విడుదల చేసింది. ఈరోజే సరికొత్తగా మార్కెట్ లో అడుగుటపెట్టిన ఈ యాపిల్ పవర్ ఫుల్ సిస్టమ్ వివరాలు తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
iMac 24 Inch : ప్రైస్
ఐమ్యాక్ 24 ఇంచ్ ను ఇండియాలో రూ. 1,34,990 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ కొత్త 24 ఇంచ్ ఐమ్యాక్ ఈరోజు నుంచి ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ యాపిల్ ప్రోడక్ట్ నవంబర్ 8 వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఈ 24 ఇంచ్ ఐమ్యాక్ పెద్ద 24 ఇంచ్ రెటీనా స్క్రీన్ ను 4.5K రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఇది 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ట్రూ టోన్ తో వస్తుంది. ఈ ఐమ్యాక్ 7 కలర్ ఆప్షన్ లో లభిస్తుంది మరియు చాలా స్లీక్ డిజైన్ తో వచ్చింది. ఈ ఐమ్యాక్ యాపిల్ ఇంటెలిజెన్స్ ను కూడా కలిగి వుంది.
ఈ సిస్టం Apple M4 chip తో పని చేస్తుంది. ఇది 16-core న్యూరల్ ఇంజిన్, 10-core CPU మరియు 10-core GPU తో ఉంటుంది. ఇది 16GB యూనిఫైడ్ మెమొరీ మరియు 256GB SSD తో వస్తుంది. దీన్ని 24GB లేదా 32GB యూనిఫైడ్ మెమొరీ మరియు 512GB, 1TB లేదా 2TB వరకు స్టోరేజ్ ను పెంచుకునే అవకాశం వుంది.
ఈ ఐమ్యాక్ HEVC, H.264, AV1 and ProRes, HDR with Dolby Vision, HDR10+/HDR10 మరియు HLG వీడియో ప్లే బ్యాక్ సపోర్ట్ నుం కలిగి వుంది. ఇందులో 6 హై ఫెడిలిటీ స్పీకర్లు, Spatial Audio మరియు Dolby Atmos సపోర్ట్ లను కలిగి వుంది. ఈ 24 ఇంచ్ ఐమ్యాక్ కంటెంట్ క్రియేటర్స్ మరొఇయి హెవీ గేమర్స్ కి సైతం అనువైన అన్ని వివరాలు కలిగి వుంది.