జియో ఆటో పేమెంట్ మీ నంబర్ పైన కూడా సెట్ చేసుకోవాలా..!

జియో ఆటో పేమెంట్ మీ నంబర్ పైన కూడా సెట్ చేసుకోవాలా..!
HIGHLIGHTS

జియో తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం లేటెస్ట్ గా తీసుకొచ్చిన ఫీచర్ UPI AutoPay.

ఈ ఫీచర్ కేవలం ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది

ప్రతి నెలా ఆటొమ్యాటిగ్గా రీఛార్జ్ అయిపోతుంది

రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం లేటెస్ట్ గా తీసుకొచ్చిన ఫీచర్ UPI AutoPay. ఈ ఫీచర్ ద్వారా నెల నెలా టైం చూసుకొని చేసే మాన్యువల్ రీఛార్జ్ నుండి విముక్తి లభిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఒక్కసారి రీఛాజ్ ను సెట్ చేసుకుంటే ప్రతి నెలా ఆటొమ్యాటిగ్గా రీఛార్జ్ అయిపోతుంది. ఈ UPI AutoPay ఫీచర్ కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో జియో జతకలిసింది.

మధ్యలో ప్లాన్ ను మార్చే అవకాశం ఉండదనే అనుమానలకు తావివ్వకుండా, జియో ఆటోపే ఫీచర్ తో ఎప్పుడైనా కొత్త ప్లాన్స్ ఎంచుకోవడం లేదా సవరిచడం మరియు ఆటోపే క్యాన్సిల్ చెయ్యడానికి కూడా అనుమతిస్తుంది. అయితే, ఈ ఫీచర్ కేవలం ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

UPI PIN లేకుండా రూ. 5000 వరకు ట్రాన్సాక్షన్ కోసం'ఉపయోగించవచ్చు. రూ. 5,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ కోసం వినియోగదారులు UPI పిన్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. 

Jio UPI Autopay  ని ఎలా సెట్ చెయ్యాలి?

  • ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో MyJio మొబైల్ యాప్‌ని తెరవండి
  • ఇక్కడ మొబైల్ విభాగానికి వెళ్లి సెటప్ జియో ఆటోపే పై నొక్కండి
  • తరువాత “We support Bank Account and UPI” అని వస్తుంది.
  • ఇప్పుడు ఇక్కడ కనిపించే Start పై నొక్కండి.
  • ఇక్కడ మీరు మీ ఆటోమేటెడ్ ప్రీపెయిడ్ సైకిల్‌కి జతచేయాలనుకుంటున్న మీ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు.
  • మీకు కావాల్సిన ప్లాన్ ఎంచుకుని, దానిపై నొక్కండి.
  • తర్వాత, మీరు చెల్లింపు మోడ్‌ని ఎంచుకోవడం, UPI లేదా బ్యాంక్ ఖాతాను ఎంచుకోవడం ద్వారా UPIలో ప్రాసెస్ చేయవచ్చు.
  • ఆ తర్వాత మీరు UPI వివరాలను ఇవ్వడం ద్వారా దాన్ని ధృవీకరించవచ్చు.

ఈ విధంగా మీ Jio UPI Autopay  సెట్ చేసుకోవచ్చు.

జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo