HIGHLIGHTS
Gmail పాస్ వర్డ్ ను మరచిపోవడం సమస్యగా ఉంటుంది.
మీ Gmail పాస్ వర్డ్ ను మరచిపోతే ఏమి చేస్తారు?
మీరు Android ఫోన్ ను ఉపయోగిస్తే, ఈ ఖాతా తప్పనిసరి
ఆఫీస్ పనులకే కావచ్చు లేదా వ్యక్తిగత జీవితంలోని అవసరాలకు కూడా ఉపయోగపడే Gmail పాస్ వర్డ్ ను మరచిపోవడం సమస్యగా ఉంటుంది. ముఖ్యంగా, Google యొక్క మరే ఇతర సర్వీస్ అయినా ఉపయోగించలనుకుంటే, మీకు ఇదే Gmail ఖాతా అవసరం అవుతుంది. మరొక విషయం, మీరు Android ఫోన్ ను ఉపయోగిస్తే, ఈ ఖాతా తప్పనిసరి. మరి మీరు అటువంటి మీ Gmail పాస్ వర్డ్ ను మరచిపోతే ఏమి చేస్తారు? అందుకే, ఒక వేళా అనుకోకుండా మీరు మీ జిమెయిల్ పాస్వర్డ్ మరిచిపోతే, దాన్ని ఎలా రికవర్ చేయాలనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. దీని గురించి పూర్తిగా స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకుందాం …
SurveyStep 1 – మొదట మీ Google Account లేదా Gmail పేజీని తెరవండి.
Step 2 – ఇప్పుడు గూగుల్ లాగిన్ పేజీలోని 'Forget Password' ఎంపిక పై క్లిక్ చేయండి.
Step 3 – మీకు గుర్తుంకువున్న చివరి పాస్ వర్డ్ ను నమోదు చేయండి. మీకు పాస్ వర్డ్ గుర్తులేకపోతే, 'మరో మార్గం ప్రయత్నించండి' (Try another way) ఎంచుకోండి.
Step 4 – మీ Gmail ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నంబర్ కు గూగుల్ ఒక మెసేజ్ పంపుతుంది.
Step 5 – మీకు ఫోన్ నంబర్ లేకపోతే, Google మీ ఇమెయిల్ కు ఒక వెరిఫికేషన్ కోడ్‌ను పంపుతుంది. మీకు ప్రత్యామ్నాయ ఇమెయిల్ లేకపోతే, 'Try another way' ఎంచుకోండి.
Step 6 – ఇక్కడ మీకు ఇమెయిల్ పంపగల మరొక ఇమెయిల్ ఐడి ని గూగుల్ అడుగుతుంది.
Step 7: ఇప్పుడు మీరు గూగుల్ నుండి ఇమెయిల్ వచ్చినప్పుడు గూగుల్ డైలాగ్ బాక్స్ పేజీని తెరవండి.
Step 8 – రికవర్ అయిన తర్వాత, క్రొత్త పాస్ వర్డ్ ఉపయోగించి మీ Gmail కి లాగిన్ అవ్వండి.