మీ Smartphone లో వైరస్ వచ్చిందని డౌట్ ఉంటే, ఇలా సులభంగా చెక్ చేయండి.!

HIGHLIGHTS

ప్రతి ఒక్కరి చేతిలో ఉండే ప్రధాన సాధనం Smartphone అని అందరికీ తెలిసిన విషయమే

పర్సనల్ ఫోటోలు, వీడియో మొదలుకొని బ్యాంక్ డిటైల్స్ వరకు అన్ని వివరాలు కూడా స్మార్ట్ ఫోన్ లో పొందుపరుస్తున్నారు

మీ ఫోన్ లో వైరస్ వచ్చిందని డౌట్ ఉంటే, ఇలా సులభంగా చెక్ చేయండి

మీ Smartphone లో వైరస్ వచ్చిందని డౌట్ ఉంటే, ఇలా సులభంగా చెక్ చేయండి.!

ప్రతి ఒక్కరి చేతిలో ఉండే ప్రధాన సాధనం Smartphone అని అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు కేవలం కాలింగ్ కోసం మాత్రమే ఉపయోగపడిన మొబైల్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ గా అవతరించి అన్ని పనులు చక్కబెట్టేస్తుంది. ఇందులో మన పర్సనల్ డేటా, బ్యాంక్ వివరాలు, పర్సనల్ ఫోటోలు, వీడియో మొదలుకొని అఫీషియల్ డిటైల్స్ వరకు అన్ని వివరాలు కూడా స్మార్ట్ ఫోన్ లో పొందుపరుస్తున్నారు. మరి అటువంటి స్మార్ట్ ఫోన్ లో ఉన్న డేటా లీక్ అయితే? ఇందుకేముంది మీ ఊపిరి ఆగినంత పనవుతుంది. ఇలాంటివి జరగడానికి ప్రధాన కారణం మీ ఫోన్ లో వైరస్ లేదా మాల్వేర్ బారిన పడటం. అందుకే, మీ ఫోన్ లో వైరస్ వచ్చిందని డౌట్ ఉంటే, ఇలా సులభంగా చెక్ చేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Smartphone లో వైరస్ ను ఎలా చెక్ చేయాలి?

ఈ ఫోన్ లో వైరస్ ఉందని మీరు అనుమానం ఉంటే, ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి కొన్ని చిన్న చిన్న పనులు మీ ఫోన్ లో గమనించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • ఫోన్ ఎక్కువగా వేడి కావడం
  • ఫోన్ అకస్మాత్తుగా స్లో అవ్వడం
  • మీరు ఇన్‌స్టాల్ చేయని తెలియని యాప్‌లు ఫోన్ లో కనిపించడం
  • సాధారణ కంటే వేగంగా బ్యాటరీ డ్రెయిన్ అవ్వడం
  • ఎక్కువగా పాప్-అప్ యాడ్స్ రావడం
  • అవసరం లేకున్నా డేటా వినియోగం అనవసరంగా పెరగడం

ఇలాంటి లక్షణాలు మీ ఫోన్ లో కనిపిస్తే, ఈ ఫోన్ లో వైరస్ అటాక్ జరిగినట్లు మీరు అనుమానం వ్యక్తం చేయవచ్చు. ఇలా మీకు ఏదైనా డౌట్ వస్తే కొంత డీప్ చేయండి.

మీ స్మార్ట్ ఫోన్ లోని యాప్‌ లను చెక్ చేయండి

ముందు మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసిన యాప్స్ చెక్ చేయండి. ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి యాప్స్ లేదా యాప్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళండి. ఇందులో మీరు ఇన్స్టాల్ చేయని లేదా విచిత్రమైన యాప్స్ కనిపిస్తే వెంటనే అన్ ఇన్స్టాల్ చేయండి.

ఈ ఫోన్ బ్యాటరీ అండ్ డేటా యూసేజ్ పరిశీలించండి

మీ ఫోన్ బ్యాక్‌ గ్రౌండ్‌లో ఎక్కువ బ్యాటరీ లేదా డేటా వాడుతున్నట్లు ఏదైనా యాప్ ఉందేమో చెక్ చేయండి. అలాంటి యాప్స్ కనిపిస్తే నిస్సంకోచంగా ఆ యాప్ ని డిలీట్ చేయండి. దీనికోసం బ్యాటరీ సెటింగ్స్ మరియు డేటా సెట్టింగ్స్ ద్వారా చెక్ చేయండి.

మీ ఫోన్ యాప్స్ స్కాన్ చేయండి

మీ ఫోన్ ,లో ఉన్న యాప్స్ ఏమైనా మీ ఫోన్ కి నష్టం కలిగించే విధంగా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి. ఈ ఫోన్ ఉన్న గూగుల్ ప్లే ప్రోటెక్ట్ తో స్కాన్ చేయండి. ఇందులో ఏదైనా యాప్ వల్ల సమస్య ఉందని నోటిఫై చేస్తే, ఆ యాప్ డిలీట్ చేయండి.

మీ ఫోన్ లో నమ్మకమైన యాంటీ వైరస్ ఇన్స్టాల్ చేయండి

చాలా స్మార్ట్ ఫోన్ లలో బిల్ట్ ఇన్ యాంటీ వైరస్ యాప్స్ ఉంటాయి. ఒకవేళ మీ ఫోన్ లో అటువంటి యాప్ లేకుంటే Avast Mobile Security లేదా Kaspersky Mobile Antivirus వంటి యాంటీ వైరస్ యాప్స్ ఇన్స్టాల్ చేసి మీ ఫోన్ ఒకసారి పూర్తిగా స్కాన్ చేయండి. ఇది మీ ఫోన్ లో వైరస్ ఉంటే మీకు సి తొలగిస్తుంది మరియు మీకు ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తుంది.

Smartphone Virus Check

ఇప్పటి వరకు మీ ఫోన్ లో వైరస్ లేదా మాల్వేర్ ఎలా చెయ్ చెక్ చేయాలి అని చూశాము. అయితే, ఇప్పుడు మీ ఫోన్ లో మీరు చేయకూడని పనులు చూద్దాం.

Also Read: Samsung Galaxy Z Fold 6 పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!

స్మార్ట్ ఫోన్ లో ఎలాంటి పనులు చేయకూడదు

ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఫోన్ లో APK ఫైల్స్‌ను తెలియని వెబ్‌సైట్స్ నుంచి డౌన్‌లోడ్ చేయడం చేయకండి. ఇలా చేస్తే ఇవి మీ ఫోన్ సెక్యూరిటీని కాంప్రమైజ్ చేసి మీ డేటాని ఇతరులకు చేరవేసే అవకాశం ఉంటుంది. ఇది మీ డేటాకి గొడ్డలిపెట్టు లాంటిది. మీ ఫోన్ లో అన్ని యాప్స్ కి అనవసరంగా అన్ని పర్మిషన్స్ ఇవ్వకండి, ఇది డేటా చౌర్యానికి మొదటి రీజన్ కావచ్చు. ఆన్లైన్ లో ర్యాండమ్ గా వచ్చే ఉచిత రివార్డ్స్ లేదా ఇతర లోపభూయిష్ట లింక్స్ పై క్లిక్ చేయకండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo