Samsung Galaxy Z Fold 6 పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

Samsung Galaxy Z Fold 6 పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది

ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్ లో అత్యాధునిక ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది

దాదాపు రూ. 60,000 వేల రూపాయల భారీ డిస్కౌంట్ మీకు అమెజాన్ నుంచి లభిస్తుంది

Samsung Galaxy Z Fold 6 పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!

Samsung Galaxy Z Fold 6 పై అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్ లో వచ్చింది మరియు అత్యాధునిక ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఆఫ్ కోర్స్, ఈ సిరీస్ నెక్ట్స్ జనరేషన్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ ఫోన్ ప్రైస్ లో స్వల్పంగా మార్పులు జరిగాయి. అయితే, ఈరోజు ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై దాదాపు రూ. 60,000 వేల రూపాయల భారీ డిస్కౌంట్ మీకు అమెజాన్ నుంచి లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy Z Fold 6 : ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 1,64,999 లాంచ్ ప్రైస్ తో విడుదలయ్యింది. అయితే, ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి 35% (రూ. 55,000) భారీ డిస్కౌంట్ తో రూ. 1,09,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 1,04,999 ధరకే మీకు లభిస్తుంది. ఈ ఫోన్ పై ప్రధాన బ్యాంక్ క్రెడిట్ తో నో కాస్ట్ EMI ఆఫర్ మరియు Amazon Pay ICICI క్రెడిట్ కార్డు తో రూ. 3,299 అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది. Buy From Here

Samsung Galaxy Z Fold 6 : ఫీచర్స్

ఇది శాంసంగ్ యొక్క అత్యాధునిక ఫోల్డబుల్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 7.6 ఇంచ్ QXGA+ డైనమిక్ AMOLED 2X మెయిన్ స్క్రీన్, 6.3 ఇంచ్ HD+ డైనమిక్ AMOLED 2X అవుటర్ స్క్రీన్ ఉంటాయి. ఈ ఫోన్ రెండు స్క్రీన్ కూడా స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 ప్రోసెసర్ తో నడుస్తుంది. ఇది 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ Android 14 ఆధారిత One UI 6.1.1 తో వస్తుంది మరియు త్వరగా లేటెస్ట్ ఆండ్రాయిడ్ కి అప్డేట్ అవుతుంది.

Samsung Galaxy Z Fold 6 offer on Amazon

ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సిస్టం ను శాంసంగ్ అందించింది. ఈ ఫోన్ వెనుక 50MP వైడ్ మెయిన్, 12MP అల్ట్రా వైడ్ మరియు 10MP టెలిఫోటో కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే, ఫోన్ కవర్ స్క్రీన్ లో 10MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది మరియు మెయిన్ స్క్రీన్ లో 4MP అండర్ డిస్ప్లే కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ సూపర్ HDR ఫోటో, ప్రో ఫోటో మరియు 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: Jio Happy New Year 2026: కొత్త సంవత్సరం కోసం కొత్త ప్లాన్స్ అందించిన జియో.!

ఈ ఫోన్ 4,400 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులో 25W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఇది నోట్ అసిస్టెంట్, లైవ్ ట్రాన్స్లేట్ మరియు స్కెచ్ టు ఇమేజ్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. దీనికి ముందు వచ్చిన ఫోల్డ్ ఫోన్ తో పోలిస్తే ఇది చాలా స్లీక్ డిజైన్ తో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo