SIM Card Check: మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా.!

SIM Card Check: మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా.!
HIGHLIGHTS

మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు

వినియోగదారులకు కొత్త సౌలభ్యాన్ని ప్రభుత్వం అందించింది

వరికి సంబంధించిన మొబైల్ నెంబర్ వివరాలు కావాలన్నా ఇట్టే తెలుసుకోవచ్చు

SIM Card Check: మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? ఇప్పటి వరకు చేయకపోతే, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే, గతంలో లైఫ్ టైం ఫ్రీ ఇన్ కమింగ్ వ్యాలిడిటీ ఉన్న రోజుల్లో చాలా వరకు ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డు లను కలిగి ఉండేవారు. అయితే, ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకున్నా, ఇటీవల టెలికాం కంపెనీలు చేపట్టిన AI KYC వెరిఫికేషన్ లో వచ్చిన దారుణమైన ఫలితాలు కొత్త అనుమానాలకు తావిచ్చాయి. అందుకే, ఎవరి పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ కలుగుతోంది.

వాస్తవానికి, కస్టమర్ సిమ్ కార్డు కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, టెలికాం కంపెనీలను ఆశ్రయించవలసి వచ్చేది. అయితే, ఇటువంటి జటిలమైన సమస్యలు ఏమి లేకుండా వినియోగదారులకు కొత్త సౌలభ్యాన్ని ప్రభుత్వం అందించింది.

SIM Card Check
SIM Card Check

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) టెలికాం యూజర్ల కోసం సౌలభ్యం కోసం టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్ మెంట్ మరియు కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAFCOP) సైట్ ను తీసుకు వచ్చింది. ఈ సైట్ నుండి ఎవరికి సంబంధించిన మొబైల్ నెంబర్ వివరాలు కావాలన్నా ఇట్టే తెలుసుకోవచ్చు.

SIM Card Check: ఎలా చెయ్యాలి?

యూజర్లు వారి పేరు మీద ఉన్న సిమ్ కార్డ్ వివరాలు తెలుసుకోవడానికి, ముందుగా వారి మొబైల్ ఫోన్ బ్రౌజర్ లేదా ల్యాప్‌ టాప్ లేదా కంప్యూటర్‌ లో tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ ని ఓపెన్ చేయాలి. ఈ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్, క్యాప్చా మరియు OTP ల కోసం ప్రత్యేకమైన బాక్స్ లు ఉంటాయి.

ఇక్కడ సూచించిన బాక్స్ లో యూజర్ మొబైల్ నంబర్‌ ను నమోదు చెయ్యాలి. ఆ తర్వాత క్రింద క్యాప్చాని ఎంటర్ చేసి ‘Validate Captcha’ పైన నొక్కాలి. ఇలా చేసిన వెంటనే యూజర్ అందించిన మొబైల్ నెంబర్ పై OTP నెంబర్ ను అందుకుంటారు. యూజర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అంతే, మరు అందించిన మొబైల్ నెంబర్ తీసుకున్న వ్యక్తి పేరుతో ఉన్న అన్ని మొబైల్ నెంబర్ లు స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి.

Also Read: Prime Members కోసం అర్ధరాత్రి నుంచి మొదలైన అమెజాన్ Great Summer Sale

ఇక్కడ వచ్చిన నెంబర్ లలో ఏదైనా నెంబర్ మీకు తెలియకుండా ఉపయోగంలో ఉన్నట్లయితే, మీరు మీ సౌలభ్యం ప్రకారం ఆ నెంబర్ ను గురించి రిపోర్ట్ కూడా చేయవచ్చు. తర్వాత, మీరు ఫిర్యాదు చేసిన మొబైల్ నెంబర్ ని ప్రభుత్వం చెక్ చేస్తుంది.

tafcop.dgtelecom.gov.in పోర్టల్‌లో మీరు ఉపయోగించని మొబైల్ నెంబర్ లేదా మీ పేరు పైన కనిపిస్తే ఇంకేదైనా కొత్త నెంబర్ కనిపిస్తే, ఈ విషయం గురించి యూజర్ ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వం మీరు కంప్లైంట్ చేసిన నెంబర్‌ ను చెక్ చేసి బ్లాక్ చేస్తుంది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo