Google Genie 3 : నూతన టెక్నాలజీతో మల్టీ మోడల్ జనరేటివ్ AI మోడల్ తెచ్చిన గూగుల్.!
ప్రపంచ టెక్ దిగ్గజ గూగుల్ ప్రపంచానికి మరో కొత్త AI మోడల్ Google Genie 3 అందించింది
టెక్స్ట్ ప్రాంప్ తో అద్భుతమైన గేమ్స్ మొదలుకొని స్టోరీస్ మరియు యాప్స్ క్రియేట్ చేసే శక్తి Google Genie 3 కి ఉంది
Google DeepMind నుంచి వచ్చిన అద్భుత ఆవిష్కరణ లలో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది
Google Genie 3 : ప్రపంచ టెక్ దిగ్గజ గూగుల్ ప్రపంచానికి మరో కొత్త AI మోడల్ అందించింది. టెక్స్ట్ ప్రాంప్టు తో అద్భుతమైన గేమ్స్ మొదలుకొని స్టోరీస్ మరియు యాప్స్ ను సైతం క్రియేట్ చేసే శక్తి ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ కు ఉంది. Veo 2 మరియు Veo 3 వంటి వీడియో జెనరేట్ ఏఐ మోడల్స్ అందించిన గూగుల్, ఇప్పుడు ఇప్పుడు వాటికంటే మరింత అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్ ని కూడా అందించింది. అదే, జీనీ 3 ఏఐ మోడల్ మరియు ఇది క్లిష్టమైన టెక్నాలజీని చాలా సింపుల్ టెక్స్ట్ క్రియేట్ చేసే శక్తి కలిగి ఉంటుంది. Google DeepMind నుంచి వచ్చిన అద్భుత ఆవిష్కరణలలో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది.
SurveyGoogle Genie 3 : అంటే ఏమిటి?
ఇది గూగుల్ డీప్ మైండ్ రూపొందించిన అడ్వాన్డ్స్ మల్టీ మోడల్ జనరేషన్ AI మోడల్ గా చెప్పబడుతుంది. ఇది యూజర్ కోరుకునే యాప్, స్టోరీస్ లేదా యాప్స్ ను కేవలం సింపుల్ టెక్స్ట్ లేదా ఇమేజ్ ఆధారంగా రియల్ టైమ్ లో క్రియేట్ చేసి అందిస్తుంది. దీనికోసం మీకు కోడింగ్ లేదా ఫ్రేమ్ వర్క్ లేదా ఇంకేమైనా టెక్నాలజీ గురించి ఎటువంటి అనుభవం కూడా అవసరం కూడా ఉండదు. జస్ట్ మీరు ఎటువంటి యాప్ లేదా గేమ్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో జీనీ 3 కి ప్రాంప్ట్ అందిస్తే చాలు, ఇక కథంతా అదే చూసుకుంటుంది.

Genie 3 ఎలా పనిచేస్తుంది?
ఇది పని చేసే తీరు చూస్తే మిమ్మల్ని మీరే నమ్మలేరు అని గూగుల్ చెబుతోంది. ఎందుకంటే, ఇది కేవలం చిన్న వాక్యంతో ఇన్ పుట్ అందిస్తే, రియల్ టైమ్ లో గేమ్ లేదా యాప్ క్రియేట్ చేసి బ్రౌజర్ లింక్ అందిస్తుంది. మీరు ఆ లింక్ ద్వారా ఆ గేమ్ ను రియల్ టైం లో ఆదుకునే అవకాశం ఉంటుంది. మరింత ఆకట్టుకునే విషయం ఏమిటంటే, ఇది రియల్ వరల్డ్ ను తలపించే సన్నివేశాలు క్రియేట్ చేసి ఇస్తుంది. అంటే, ఇది నిజజీవితంలో కనిపించే లొకేషన్ మరియు వివరాలతో ఉంటుంది.
Also Read: OPPO K13 Turbo Series 5G లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు విడుదల చేసిన ఒప్పో.!
ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది?
ఇది చిన్న పిల్లలకు గేమ్స్ ద్వారా కొత్త విషయాలు నేర్పేందుకు, కంటెంట్ లో వైవిధ్యమైన వివరాలతో కథలు మరియు మరింత ఆకట్టుకునే కంటెంట్ క్రియేట్ చేయాలనుకునే క్రియేటర్ లకు మరియు సింపుల్ గేమ్స్ (ప్రోటోటైప్) ను క్విక్ గా చేయాలనుకునే గేమర్స్ కి బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వాస్తవానికి, తన ఊహలకు ప్రాణం పోయాలని చూసే ప్రతి ఒక్కరికి ఇది సహాయం చేస్తుంది.
అయితే, ప్రస్తుతం ఈ కొత్త మోడల్ కేవలం రీసర్చ్ పర్పస్ లో భాగంగా అందుబాటులోకి వచ్చింది. అయితే, త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందిని గూగుల్ చెబుతోంది.