దసరా మరియు దీపావళి ఎఫెక్ట్: దూసుకు పోతున్నబంగారం ధర.!

దసరా మరియు దీపావళి ఎఫెక్ట్: దూసుకు పోతున్నబంగారం ధర.!
HIGHLIGHTS

దసరా మరియు దీపావళి ఎఫెక్ట్ తో మార్కెట్ లో బంగారం ధర దూసుకు పోతోంది

పండుగ సీజన్ మొదలవ్వడంతో గోల్డ్ మార్కెట్ పుజుకుంది

పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్న గోల్డ్ మార్కెట్

దసరా మరియు దీపావళి ఎఫెక్ట్ తో మార్కెట్ లో బంగారం ధర దూసుకు పోతోంది. పండుగ సీజన్ మొదలవ్వడంతో గోల్డ్ మార్కెట్ పుజుకుంది మరియు బంగారం ధర రోజు రోజుకు పెరిగిపోతోంది. గత నెల 17 నెలల కనిష్ఠ రేటును చవిచూసిన గోల్డ్ మార్కెట్, ఈ నెల లాభాల్లో దూసుకుపోతోంది. అయితే,  పసిడి ప్రియులకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఈ నెల ప్రారంభంలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరతో పోలిస్తే, ఈరోజు వరకూ గోల్డ్ ధర దాదాపుగా 1,000 రూపాయల వరకూ పెరిగింది. ఇక గత వారంతో పోలిస్తే, దాదాపుగా 1,800 రూపాయలకు పైగా పెరిగింది. అంటే, గోల్డ్ మార్కెట్ ఎంత వేగంగా పెరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఈరోజు తెలుగు రాష్ట్రలతో పాటుగా దేశరాజధానిలో గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో తెలుసుకుందామా.

Gold Price:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,850 రూపాయలుగా ఉండగా, ఈరోజు 550 రూపాయలు పెరిగి 47,350 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,660 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,660 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,370 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,680 గా ఉంది.   

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.51,660 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo