తల్లకిందులైన అంచనా.. ఈరోజు మళ్ళీ తగ్గిన గోల్డ్ రేట్.!

తల్లకిందులైన అంచనా.. ఈరోజు మళ్ళీ తగ్గిన గోల్డ్ రేట్.!
HIGHLIGHTS

రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా

గోల్డ్ రేట్ దూసుకు పోవచ్చని వేస్తున్న అంచనాలు తల్లకిందులైనట్లు కనిపిస్తోంది

రెండు రోజులు నామమాత్రపు పెరుగుదలను చూసిన ఈరోజు మాత్రం క్రిందకు దిగింది

దేశంలో అమలవుతున్న రూ. 2,000 నోట్ల ఉపసంహరణ కారణంగా గోల్డ్ రేట్ దూసుకు పోవచ్చని వేస్తున్న అంచనాలు తల్లకిందులైనట్లు కనిపిస్తోంది. గత శనివారం RBI చేసిన  రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటన తరువాత, అదేరోజు గోల్డ్ రేట్ ఊపందుకుంది. దీన్ని చూసి గోల్డ్ రేట్ మార్కెట్ లో భారీగా దూసుకు పోవచ్చని అంచనాలు సర్వత్రా పెరిగాయి. అయితే, గోల్డ్ మార్కెట్ మాత్రం రెండు రోజులు నామమాత్రపు పెరుగుదలను చూసిన ఈరోజు మాత్రం క్రిందకు దిగింది. 

ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, ఢిల్లీ, చెన్నై, జైపూర్, లక్నో చండీగఢ్ మరియు వెల్లూర్ మార్కెట్ మినహా చాలా మార్కెట్ లలో ఈరోజు గోల్డ్ రేట్ 60 వేల మార్క్ వద్ద కొనసాగుతోంది. ఈరోజు ఓవరాల్ గా గోల్డ్ రేట్ ఈరోజు తులానికి రూ. 450 నష్టాన్ని చూసింది. 

అయితే, ఇదే ట్రెండ్ కొనసాగుతుందా లేదా రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా అని ఆలోచనలో పడ్డారు పసిడి ప్రియులు. అయితే, గోల్డ్ మార్కెట్ మాత్రం 63 వేల రూపాయల పైనే చేరుకోవచ్చనిస్ చెబుతున్న నిపుణుల మాటలను మాత్రం ఎంత మాత్రమూ తోసిపుచ్చలేము. 

Gold Price Live:

ఇక ఈరోజు ప్రధాన మార్కెట్ లో గోల్డ్ రేట్ అప్డేట్ ఎలా ఉందని చూస్తే, ఈరోజు 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ రూ.450 క్రిందకు దిగి రూ.60,8700 వద్ద కొనసాగుతోంది మరియు 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ. 55,800 వద్ద కొనసాగుతోంది. 

ఈరోజు హైదరాబాద్, వైజాగ్, విజయవాడ,ముంబై, పూణే మరియు గుంటూరు మార్కెట్ లలో పైన సూచించిన ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశంలో హైరేట్ నమోదు చేసిన ఏరియాల విషయానికి వస్తే, తమిళనాడు లోని అన్ని ప్రధాన మార్కెట్ లావు ఈరోజు అధిక రేటును గోల్డ్ మార్కెట్ నమోదు చేసింది. ఈరోజు తమిళనాడు మార్కెట్ లలో ఒక తులం 24K గోల్డ్ రేట్ రూ. 61,360 గా ఉండగా, ఒక తులం 24K గోల్డ్ రేట్ రూ. 56,250 గా నమోదయ్యింది. 

Note: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ రేట్ లలో మార్పులు ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo