Gold: రెండడుగులు ముందుకు ఒక్కడుగు వెనక్కి వేస్తున్న గోల్డ్ మార్కెట్.!

Gold: రెండడుగులు ముందుకు ఒక్కడుగు వెనక్కి వేస్తున్న గోల్డ్ మార్కెట్.!
HIGHLIGHTS

గత నెల మొత్తం దాదాపుగా స్థిరంగా కొనసాగిన గోల్డ్ మార్కెట్

ఈనెలలో మాత్రం ఊహకు అందకుండా సాగిపోతోంది

ఈ వారంలో ఒకరోజు పెరిగితే తరువాతి రోజు క్రిందకు దిగుతోంది

Gold: రెండడుగులు ముందుకు ఒక్కడుగు వెనక్కి వేస్తున్న గోల్డ్ మార్కెట్. గత నెల  మొత్తం దాదాపుగా స్థిరంగా కొనసాగిన గోల్డ్ మార్కెట్, ఈనెలలో మాత్రం ఊహకు అందకుండా సాగిపోతోంది. గత వారం మొత్తం పెరుగుతూ వచ్చిన బంగారం ధర,ఈ వారంలో మాత్రం ఒకరోజు పెరిగితే తరువాతి రోజు క్రిందకు దిగుతోంది. అదికూడా, పెద్ద మార్పులనే గోల్డ్ మార్కెట్ నమోదు చేస్తోంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఏమిటో చూద్దామా. 

Gold:

ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.54,200 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.600 రూపాయలు పెరిగి   రూ.54,800 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.59,130 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.59,780 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈఈరోజు బంగారం ధర రూ.650 రూపాయలు పెరుగుదలను నమోదు చేసినట్లు మనం చూడవచ్చు.

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,780 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,780 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.59,930 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,410 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,420 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo