Flipkart బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి ఈరోజు Apple iPad (9th Gen) భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 18 వేలకే అందుకోండి అంటోంది ఫ్లిప్ కార్ట్. దీపావళి మరియు దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకు వచ్చిన ఈ బిగ్ సేల్ నుంచి ఈ డీల్ అందించింది. యాపిల్ ఐప్యాడ్ కొనాలని అనుకుంటున్నా బడ్జెట్ కారణంగా ఆలోచిస్తున్న వారికి ఇది తగిన డీల్ అవుతుంది. యాపిల్ పెన్సిల్ మరియు కీబోర్డ్ సపోర్ట్ ఈ ఐప్యాడ్ ఈరోజు మంచి ఆఫర్ ధరకి సేల్ అవుతోంది.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart Sale Apple iPad : ఆఫర్
ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అనౌన్స్ చేసింది. యాపిల్ ఐప్యాడ్ ను 2021 సెప్టెంబర్ నెలలో రూ. 29,900 రూపాయల ధరతో ఇండియాలో విడుదల అయ్యింది. అయితే, ఈ ఐప్యాడ్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి దాదాపు రూ. 10,000 డిస్కౌంట్ తో కేవలం రూ. 19,999 ధరకు సేల్ అవుతోంది.
ఈ ప్యాడ్ ను మరింత చవక ధరకు అందుకోవడానికి అవసరమైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ను కూడా ఫ్లిప్ కార్ట్ జత చేసింది. అదేమిటంటే, RBL, Axis, BOBCARD మరియు Yes బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఐప్యాడ్ ను కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1750 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఐప్యాడ్ రూ. 18,249 రూపాయల డిస్కౌంట్ ధరకే అందుతుంది. Buy From Here
ఈ ఐప్యాడ్ A13 Bionic చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఐప్యాడ్ 10.2 ఇంచ్ రెటినా స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ Apple Pencil (1st Generation) సపోర్ట్ మరియు ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ ఓలియా ఫోబిక్ కోటింగ్ తో వస్తుంది.
ఈ ఐప్యాడ్ 8MP వాడి`వైడ్ సింగిల్ రియర్ కెమెరా మరియు 12MP సెల్ఫీ కెమెరా తో వస్తుంది. ఈ కెమెరా 3x జూమ్, సినిమాటిక్ వీడియోలను 1080p మరియు 720p వద్ద అందిస్తుంది. ఈ ఐప్యాడ్ Dolby Digital మరియు Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీ తో వస్తుంది.