షియోమి సంస్థకు మొదలైన నకిలీ బెడద

షియోమి సంస్థకు మొదలైన నకిలీ బెడద
HIGHLIGHTS

అనధికార ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు కనుగొన్నారు.

నకిలీ ఉత్పత్తుల స్వాధీనం.

పవర్ బ్యాంకులు, ఛార్జర్లు, ఇయర్ ఫోన్లు మరియు మరెన్నో ప్రోడక్టులు

షియోమి సంస్థకు మొదలైన నకిలీ బెడద. బెంగళూరు మరియు చెన్నై వ్యాప్తంగా ఏడుగురు సప్లయర్లు అనధికార ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు కనుగొన్నారు. నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సప్లయర్లను మరియు 33.3 లక్షల రూపాయల విలువైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు షావోమి బ్రాండ్ యొక్క నకిలీ నిరోధక వ్యవస్థ తెలిపింది. ఇది కనుగొనబడిన తరువాత, సంస్థ స్థానిక పోలీస్ స్టేషన్ కి కూడా ఫిర్యాదు చేసింది. తరువాత అక్టోబర్ మరియు నవంబర్ మధ్య సప్లయర్ల దుకాణాలపై అనేక దాడులు జరిపిన విషయాన్ని కూడా వెల్లడించాయి.

మొబైల్ ఫోన్ కేసులు, హెడ్ ఫోన్లు, పవర్ బ్యాంకులు, ఛార్జర్లు, ఇయర్ ఫోన్లు మరియు మరెన్నో ప్రోడక్టులు ఉన్న ఈ సప్లయర్ల నుండి 3 వేలకు పైగా ఉత్పత్తులను కనుగొన్నట్లు షియోమి తెలిపింది. "24.9 లక్షల రూపాయలు మరియు 8.4 లక్షల విలువైన నకిలీ మి ఇండియా ఉత్పత్తులను విక్రయించినందుకు రెండు నగరాల నుండి దుకాణ యజమానులను అరెస్టు చేశారు. విచారణలో, ఈ సరఫరాదారులు చాలా కాలంగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని మరియు చాలా బ్రాండ్ల అనధికార ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించారని తేలింది ” అని షియోమి మీడియాకు ఒక ప్రకటనలో తెలిపింది.

షియోమి ఇండియా అనధికార మరియు నకిలీ ఉత్పత్తుల కోసం మార్కెట్‌ను పర్యవేక్షించే నకిలీ నిరోధక కార్యక్రమంతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అలాంటి కార్యక్రమం ద్వారా ఇద్దరు సప్లయర్ల పైన చేసిన తాజా సోదాల్లో  చెన్నై మరియు బెంగళూరులలో 33.3 లక్షల రూపాయల విలువైన నకిలీ ఉత్పత్తులను స్వాధీనం  చేసుకోవడానికి దారితీసింది.

వినియోగదారులు తమ కొనుగోలును గుర్తించడానికి మరియు వారు కొనుగోలు చేస్తున్న షియోమి ఉత్పత్తి ఒరిజినల్ అవునా కాదా అని నిర్ధారించడానికి షియోమి కొన్ని దశలను కూడా వివరించింది.

  • కొన్ని ప్రోడక్టులు ప్రోడక్ట్ యొక్క ప్రామాణికతను గుర్తించడానికి mi.com లో తనిఖీ చేయగల భద్రతా కోడ్‌లను కలిగి ఉంటాయి- ఉదా. మి పవర్‌బ్యాంక్స్, అన్ని ఆడియో ఉత్పత్తులు
  • రిటైల్ బాక్సుల ప్యాకేజింగ్ మరియు నాణ్యత చాలా భిన్నంగా ఉంటాయి. అసలు ప్యాకేజింగ్‌ను ధృవీకరించడానికి మీరు ఏదైనా మి హోమ్ / మి స్టోర్‌ను సందర్శించవచ్చు
  • ఉత్పత్తిపై అసలు మి ఇండియా లోగో కోసం తనిఖీ చేయండి మరియు అది అధికారంగ ఉంటే మీకు తెలుస్తుంది. ప్యాకేజింగ్ యొక్క అసలు లోగోను mi.com లో చూడవచ్చు
  • మి బ్యాండ్ (లు) వంటి అన్ని అధీకృత ఫిట్‌నెస్ ఉత్పత్తులు మి ఫిట్ యాప్ అనుకూలతను కలిగి ఉంటాయి.
  • అనధికార కేబుల్స్ సన్నగా ఉంటాయి మరియు సులభంగా విరిగిపోతాయి

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo