Facebook గేమింగ్ లాంచ్

Facebook గేమింగ్ లాంచ్
HIGHLIGHTS

సాధారణ గేమ్స్ తో పాటు గేమింగ్ కమ్యూనిటీస్ కి యాక్సెస్ ఇవ్వడమే లక్ష్యం

facebook తన కొత్త గేమింగ్ ఆప్ తో Twitch, YouTube మరియు Mixer వంటి వాటికీ పోటీని తీసుకోవటానికి ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఫేస్‌బుక్ గేమింగ్ అని పిలువబడే ఈ ఆప్, ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది మరియు త్వరలో దీన్ని iOS కి అందిచనున్నది. న్యూయార్క్ టైమ్స్ యొక్క నివేదిక ప్రకారం, ఆగ్నేయాసియా మరియు లాటిన్ అమెరికాలో ఫేస్ బుక్ గేమింగ్ అప్లికేషన్ను కంపెనీ గత 18 నెలల్లో పరీక్షించింది. ఆపిల్ వాటిని ఆమోదించిన తర్వాత iOS వెర్షన్లు విడుదల చేయబడతాయి.

"గేమింగ్‌లో పెట్టుబడులు పెట్టడం మాకు ప్రాధాన్యతగా మారింది, ఎందుకంటే గేమింగ్‌ ను ప్రజలను నిజంగా కలిపే వినోద రూపంగా చూస్తాము" అని ఫేస్‌బుక్ App హెడ్ అయినటువంటి,  ఫిద్జీ సిమో తెలిపారు. " వినోదం అనేది నిష్క్రియాత్మక వినియోగం యొక్క రూపమే కాదు, అంతరంగా  ప్రజలను ఒకచోట చేర్చే వినోదం."

ఈ కొత్త ఆప్, సాధారణ గేమ్స్ తో పాటు గేమింగ్ కమ్యూనిటీస్ కి  యాక్సెస్ ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది Live గేమ్ స్ట్రీమ్‌ లను చూడటానికి మరియు క్రియేట్ చేయడానికి గేమర్స్ కి ఒక మార్గాన్ని ఇస్తుంది. గో లైవ్ అనే ఫంక్షన్ ఒకే పరికరంలో ఇతర మొబైల్ గేమ్స్ స్ట్రీమ్‌ లను అప్‌లోడ్ చేయడానికి ప్రజలకు సులభమైన మార్గాన్ని ఇస్తుంది. స్ట్రీమ్స్  గురించి మాట్లాడుతూ, ఈ స్ట్రీమ్‌ లను ఒకరి వ్యక్తిగత ఫేస్‌బుక్ పేజీలో భాగస్వామ్యం చేయవచ్చని, ఇది ప్రజలకు స్ట్రీమింగ్ చూడడాన్ని సులభతరం చేస్తుందని నివేదిక పేర్కొంది. పోల్చి చూస్తే, ట్విచ్ వంటి ప్లాట్‌ఫాం సాధారణ గేమర్లను అర్థం చేసుకోవడానికి మరియు ఉపయోగించటానికి క్లిష్టంగా ఉంటుంది, భారతదేశం వంటి కొన్ని దేశాలలో ఈ ప్లాట్‌ఫాం ఇంకా అందుబాటులో లేదు.

ట్విచ్ మరియు మిక్సర్ వంటి వారిని సవాలు చేసే ప్రయత్నంలో ఫేస్ బుక్  విజయవంతమైందో లేదో మనం చూడాలి. యూట్యూబ్ గేమింగ్ రూపంలో అంకితమైన స్ట్రీమింగ్ మరియు గేమింగ్ ఆప్ లో గూగుల్ కూడా ప్రయత్నించింది, అయితే, ఈ ప్లాట్‌ఫాం గత ఏడాది మే లో మూసివేయబడింది మరియు ప్రధాన యూట్యూబ్ ఆప్ లో  విలీనం చేయబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo