మీ పేరుతో ఎన్ని మొబైల్ నంబర్లు యాక్టివ్ గా ఉన్నాయో చిటికెలో తెలుసుకోవచ్చు

మీ పేరుతో ఎన్ని మొబైల్ నంబర్లు యాక్టివ్ గా ఉన్నాయో చిటికెలో తెలుసుకోవచ్చు
HIGHLIGHTS

మీ పేరుతో ఎన్ని మొబైల్ నెంబర్స్ యాక్టివ్ గా ఉన్నాయో తెలుసా?

మీ పేరుతో ఇంకెవరైనా SIM కార్డు వాడుతున్నారనే అనుమానం మీకు కలిగిందా?

మీ పేరు మీద ఎన్ని యాక్టివ్ నంబర్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు

ఇప్పటి వరకూ మీరు చాలా మొబైల్ నంబర్స్ ఉపయోగించి ఉంటారు. మరి ప్రస్తుతం, మీ పేరుతో ఎన్ని మొబైల్ నంబర్లు యాక్టివ్ గా ఉన్నాయో తెలుసా? ఈ ప్రశ్నకు మీ సమాధానం తెలియదు, అనే ఒక్కమాటే కావచ్చు. కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) కొత్తగా తీసుకొచ్చిన టెలికం అనలైటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్ మెంట్ మరియు కన్స్యూమర్ ప్రొటక్షన్ (TAFCOP) నుండి మీకు సంబంధించిన అన్ని మొబైల్ నంబర్ల వివరాలను తెలుసుకోవచ్చు.        

దీనికోసం,  ముందుగా మీ మొబైల్ ఫోన్ బ్రౌజర్ లేదా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ ని తెరవండి. తరువాత, ఇక్కడ సూచించిన వద్ద మీ మొబైల్ నంబర్‌ నమోదు చేయండి. క్రింద OTP రిక్వెస్ట్ కోసం  సూచించిన బాక్స్ పైన నొక్కండి. మీ మొబైల్ నంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి తనిఖీ చేయండి.

OTP ని ధృవీకరించిన తరువాత, మీ పేరులో పనిచేసే అన్ని మొబైల్ నంబర్స్ యొక్క పూర్తి జాబితాను మీరు అందుకుంటారు. వాటిలో, మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏదైనా నంబర్ గురించి రిపోర్ట్ చెయవచ్చు. తరువాత, మీరు కోరుకున్న నంబర్ నడుస్తుంది మరియు మీరు ఫిర్యాదు చేసిన నంబర్లను ప్రభుత్వం తనిఖీ చేస్తుంది.

అయితే, ప్రస్తుతానికి ఈ tafcop.dgtelecom.gov.in వెబ్సైట్ కేవలం కొన్ని సర్కిల్స్ కోసం మాత్రమే విడుదల చేయబడింది. త్వరలోనే ఇది అన్ని సర్కిళ్లలో విడుదల అవుతుంది. ఒక ID గరిష్టంగా తొమ్మిది నంబర్ లను కలిగి ఉంటుంది, కానీ మీరు ఈ పోర్టల్‌లో మీరు ఉపయోగించని మొబైల్ నంబర్, మీ పేరు పైన కనిపిస్తే, మీరు ఆ నంబర్ గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఆ తరువాత ప్రభుత్వం ఆ నెంబర్‌ ను బ్లాక్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo
Compare items
  • Water Purifier (0)
  • Vacuum Cleaner (0)
  • Air Purifter (0)
  • Microwave Ovens (0)
  • Chimney (0)
Compare
0