మీ ఆధార్ సెక్యూరిటీ గురించి డౌటా? అయితే, ఎక్కడెక్కడ వాడబడిందో ఇలా తెలుసుకోవచ్చు

మీ ఆధార్ సెక్యూరిటీ గురించి డౌటా? అయితే, ఎక్కడెక్కడ వాడబడిందో ఇలా తెలుసుకోవచ్చు
HIGHLIGHTS

మీ ఆధార్ కార్డ్ సెక్యూరిటీ పైన సందేహమా

మీ ఆధార్ కార్డు వివరాలను తెలుసుకోవచ్చు.

మీ ఆధార్ ఎక్కడెక్కడ ఎందుకు వాడారో తెలుసా

కరోనా మహమ్మారి కారణంగా అన్ని పనులు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తుండగా, సైబర్ టాక్స్ మరియు ఇతర ఆన్లైన్ మోసాలు మరింతగా పెరిగి పోయాయి.  అందుకే, చాలా మందికి తమ ఆధార్ కార్డు ఏవిధమైన దుర్వినియోగానికైనా వాడబడిందా? అనే అనుమానం కూడా వస్తుంది. అయితే, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీ ఆధార్ కార్డు ఏవిధమైన అవసరాలకి వాడబడిందో తెలుసుకోవడం చాలా సులభం.

ఇక్కడ మేము అందించిన విధానంతో మీ ఆధార్ కార్డు వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ క్రింది విధంగా చేయాలి

1.  ముందుగా ప్రభుత్వ అధికారిక UIDAI యొక్క Website ఓపెన్ చేయాలి.

2.  పేజ్ ఓపెన్ అయిన తరువాత సూచించిన దగ్గర మీ 12 అంకెల ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయాలి మరియు అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ కూడా నమోదు చేసి ఎంటర్ చేయాలి.

3. ఈ విధంగా చేసినతరువాత మీకు మీ యొక్క నమోదుకాబడిన (Registered) మొబైల్ నంబర్ కి OTP వస్తుంది. ఈ OTP కేవలం ముందుగా నమోదు చేయబడిన మొబైల్ నంబరుకు మాత్రమే వస్తుంది.

 4. మీ మొబైల్ కి వచ్చిన OTP ఎంటర్ చేసిన తరువాత మీరు ఆధార్ పేజీ వివరాల్లోకి వెళతారు, ఇక్కడ మీరు మీకు సంబంధించిన వివరాలను చూడొచ్చు.

5. అయితే , ఇక్కడ మీరు ఏయే వివరాలు కావాలనుకుంటున్నారో వాటిని మీరు ఎంచుకోవలసి ఉంటుంది.

6. ఉదాహరణకి : డేట్ ఎంచుకోవడం ద్వారా ఈ డేట్ పరిధిలో ఏవిధమైన సౌకర్యాలకు ఈ కార్డు వాడంబడిదో తెలుస్తుంది.

7. అయితే ఇక్కడ ఎవరు వాడారన్న విషయం మాత్రం తెలుసుకునే వీలులేదు.

గమనిక : సెక్యూరిటీ కారణంగా, ఈ వెబ్సైట్ కొన్నిసార్లు ఓపెన్ కాకపోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo