స్మార్ట్ ఫోన్ల కోసం కొత్త Gorilla Glass Victus తీసుకొచ్చిన కార్నింగ్ సంస్థ : ఇది ఎంత గట్టిదో తెలుసా?

స్మార్ట్ ఫోన్ల కోసం కొత్త Gorilla Glass Victus తీసుకొచ్చిన కార్నింగ్ సంస్థ : ఇది ఎంత గట్టిదో తెలుసా?
HIGHLIGHTS

Gorilla Glass Victus అని పిలిచే ఈ కార్నింగ్ గ్లాస్, తీవ్రమైన డాట్స్ మరియు గీతలను నిరోధించగలిగేంత కఠినమైది.

ముందుగా వచ్చిన Gorilla Glass 6 తో పోల్చితే ఇది రెండు రెట్లు ఎత్తు నుండి పడినా కూడా వత్తిడులను తట్టుకోగలదని, కార్నింగ్ పేర్కొంది.

ఈ కొత్త Gorilla Glass Victus గ్లాస్ రాబోయే కొద్ది నెలల్లోనే మార్కెట్‌ను ముంచెత్తనుంది.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యొక్క క్రొత్త వెర్షన్ ను ఆవిష్కరించింది, ఇది మునుపటి కంటే చాలా గట్టిది మరియు కఠినమైనది. అయితే, ఇది ఎంత కఠినమైనదని అంచనా వేయవచ్చు? Gorilla Glass Victus అని పిలిచే ఈ కార్నింగ్ గ్లాస్, తీవ్రమైన డాట్స్ మరియు గీతలను నిరోధించగలిగేంత కఠినమైది.  ముందుగా వచ్చిన గొరిల్లా గ్లాస్‌ 6 తో పోల్చితే ఇది రెండు రెట్లు ఎత్తు నుండి పడినా కూడా వత్తిడులను తట్టుకోగలదని, కార్నింగ్ పేర్కొంది. ఈ కొత్త గ్లాస్ రాబోయే కొద్ది నెలల్లోనే మార్కెట్‌ను ముంచెత్తనుంది.

Gorilla Glass Victus ఎంత గట్టిగా ఉంటుంది? 

ఈసారి, కార్నింగ్ దాని కఠినమైన గ్లాస్ కోసం ఎప్పుడు అందించే నంబర్ పద్దతిని మానుకొని, బదులుగా దానిని విక్టస్ అనే పేరును ఫిక్స్ చేసింది. ఈ గ్లాస్  దెబ్బతినకుండా 2 మీటర్ల (6.5 అడుగులు) వరకు తాఖీడులను తట్టుకోగలదు, ఇది గొరిల్లా గ్లాస్ 6 తట్టుకోగల ఎత్తు కంటే రెండు రెట్లు ఎక్కువ. విక్టస్ గురించి , కార్నింగ్ వాదనల ప్రకారం, ఇది దెబ్బతినడానికి వీలులేకుండా చాలా నిరోధకతను కలిగి ఉంటాయి మరియు పగుళ్లు ఏర్పడిన తర్వాత కూడా పనిచేసే విధంగా సమగ్రతను కాపాడుకోగలవు.

Gorilla Glass ప్రాధాన్యత ఏమిటి 

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ల స్పెక్-షీట్లో గొరిల్లా గ్లాస్ ఒక ముఖ్యమైన భాగం. షియోమి, ఒప్పో, శామ్‌సంగ్, ఎల్‌జి, మోటరోలా వంటి చాలా పెద్ద బ్రాండ్లు గొరిల్లా గ్లాస్‌ పై ఆధారపడతాయి. అంతేకాదు, ఈ తయారీదారులు గ్లాస్-శాండ్‌విచ్ డిజైన్‌ ను అవలంబించడం ప్రారంభించిన తరువాత, ఫోన్ యొక్క రెండు వైపులా గొరిల్లా గ్లాస్‌ ను వాడటం మొదలుపెట్టారు.

Gorilla Glass 6 

ఇక Gorilla Glass 6 ని గుర్తుచేసుకుంటే, గొరిల్లా గ్లాస్ 6 రెండేళ్ల క్రితం వచ్చింది మరియు చాలా పెద్ద బ్రాండ్ల చే ఫ్లాగ్‌షిప్ మరియు మిడ్-రేంజ్ స్మార్ట్‌ ఫోన్ ‌లలో ఉపయోగించబడింది. అయితే, కోత్తగా ప్రకటించిన విక్టస్ మరింత కఠినంగా ఉండే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo