అండర్ రూ. 10,000 ప్రైస్ సెగ్మెంట్ బెస్ట్ Tablet డీల్స్ కోసం చూస్తున్నారా.!
అండర్ రూ. 10,000 ప్రైస్ సెగ్మెంట్ బెస్ట్ Tablet డీల్స్
ఈరోజు రెండు బెస్ట్ డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి
మల్టీ టాస్కింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం ఈ టాబ్స్ చక్కగా సరిపోతాయి
అండర్ రూ. 10,000 ప్రైస్ సెగ్మెంట్ బెస్ట్ Tablet డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు రెండు బెస్ట్ డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్స్ అమెజాన్ నుంచి అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ 10 వేల రూపాయలు అయ్యుండి, మల్టీ టాస్కింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం ఈ టాబ్స్ చక్కగా సరిపోతాయి. ఈరోజు అమెజాన్ అందించిన ఈ స్మార్ట్ ఛాయిస్ టాబ్లెట్ డీల్స్ ఏమిటో చూద్దామా.
SurveyTablet under Rs. 10,000:
అమెజాన్ నుంచి ఈరోజు 10 వేల రూపాయల ధరలో రెండు బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో, ఒకటి LenovoTab M11 టాబ్లెట్ కాగా రెండవది Infinix XPAD LTE టాబ్లెట్ ఈ రెండు టాబ్లెట్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

LenovoTab M11
ఈ లెనోవా టాబ్లెట్ ఈరోజు అమెజాన్ నుంచి 48% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 10,999 ధరలో లభిస్తుంది. అమెజాన్ ఈ టాబ్లెట్ పై రూ. 1,000 అదనపు కూపన్ డిస్కౌంట్, HDFC మరియు BOBCARD ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ టాబ్లెట్ కేవలం రూ. 8,999 రూపాయల ధరకే లభిస్తుంది.
ఇక ఈ లెనోవా టాబ్లెట్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టాబ్లెట్ పెద్ద 11 ఇంచ్ WUXGA స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఇది FHD రిజల్యూషన్ సపోర్ట్ తో ఉంటుంది. ఇది మీడియాటెక్ Helio G88 ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు 4 జీబీ ర్యామ్ తో పాటు 64 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన క్వాడ్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఇది Wi-Fi టాబ్లెట్ మరియు 13MP రియర్ కెమెరా కూడా కలిగి ఉంటుంది.
Also Read: Realme Narzo 80 Lite: అండర్ 7 వేల సెగ్మెంట్ లో 6300 mah బ్యాటరీతో వచ్చింది.!
Infinix XPAD LTE
ఇది ఇన్ఫినిక్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన టాబ్లెట్ మరియు ఈ టాబ్లెట్ 4G నెట్వర్క్ మరియు Wi-Fi పై కూడా పని చేస్తుంది. ఈ టాబ్లెట్ రూ. 11,999 ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. ఈ టాబ్లెట్ పై రూ. 1,000 రూపాయల BOBCARD మరియు Federal బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ టాబ్ కేవలం రూ. 10,999 ధరకే లభిస్తుంది.
ఈ టాబ్లెట్ 11 ఇంచ్ బిగ్ స్క్రీన్ ను FHD రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ MediaTek Helio G99 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 4 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ లో 8 MP సెల్ఫీ మరియు 8 MP రియర్ కెమెరా ఉంటాయి. ఇందులో, 7000 బిగ్ బ్యాటరీ, DTS Audio సపోర్ట్ కలిగిన నాలుగు స్పీకర్లు కూడా ఉంటాయి.