Netflix Plans Price Cut: బేసిక్ ప్లాన్ రేట్లు తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్న కొత్త రిపోర్ట్.!
OTT ప్లాట్ ఫామ్స్ మధ్య చాలా కాలంగా భారీ కాంపిటీషన్ నడుస్తోంది
పెరిగిన పోటీకి అనుగుణంగా అన్ని ఓటిటీ ప్లాట్ ఫామ్స్ కూడా తమ రేట్లు భారీగా తగ్గించాయి
నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్స్ లో భారీ మార్పులు చేయడానికి ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు
Netflix Plans Price Cut: OTT ప్లాట్ ఫామ్స్ మధ్య చాలా కాలంగా భారీ కాంపిటీషన్ నడుస్తోంది. పెరిగిన పోటీకి అనుగుణంగా అన్ని ఓటిటీ ప్లాట్ ఫామ్స్ కూడా తమ రేట్లు భారీగా తగ్గించాయి. మారిన ప్లాన్ రేట్లు ప్రభావంతో చాలా ఓటిటీ ప్లాట్ ఫామ్స్ కూడా యూజర్ బేస్ ని గలిగాయి. నెట్‌ఫ్లిక్స్ కూడా 2021 లో ఇదే ఐడియా ఫాలో అయ్యింది. అయితే, ఇప్పటికీ ఇండియన్ మార్కెట్ లో సరైన సబ్ స్క్రైబర్ బేస్ ని సాధించకపోవడం గమనార్హం. అందుకే, ఇప్పుడు మరో సారి బేసిక్ ప్లాన్స్ లో భారీ మార్పులు చేయడానికి ఆలోచిస్తున్నట్లు ఒక ది ఫిలాక్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.
SurveyNetflix Plans Price Cut
నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో యూజర్లను కోల్పుతున్న కారణముగా ఈ కొత్త నిర్ణయం తీసుకోవడానికి కారణం అవుతుందని The Philix తన న్యూస్ లో ప్రచురించింది. భారత మార్కెట్లో యూజర్ బేస్ ను మరింత పెంచడానికి నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్స్ ను మరింత చవక ధరలో ఆఫర్ చేయడానికి యోచిస్తున్నట్లు, ఈ కథనంలో తెలిపింది. అయితే, నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారికంగా ఎటువంటి అప్డేట్ బయటకు రాలేదు. ఈ రిపోర్ట్ ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ రూ. 99 ధరకు మరియు బేసిక్ ప్లాన్ ను రూ. 149 రూపాయలకు తగ్గించే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది.
2016 లో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో అడుగుపెట్టింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో చాలా ప్రీమియం ప్లాన్ సెగ్మెంట్ తో తన ఆఫర్స్ అందించింది. ఈ భారీ రేట్లు ఎక్కువ యూజర్ బేస్ ని చేరుకోవడానికి అడ్డుగా ఉన్నట్లు గమనించిన కంపెనీ 2021 లో రూ. 499 రూపాయల బేస్ ప్లాన్ ను ఒకేసారి రూ. 300 ప్రైస్ కట్ అందించి కేవలం రూ. 199 రూపాయల ఆఫర్ ధరకే ఆఫర్ చేసింది.

కొత్త రేట్లతో నెట్‌ఫ్లిక్స్ కోడోత్ భారీగానే యూజర్ బేస్ ను ఇండియాలో అందిపుచ్చుకుంది. అయితే, భారత్ లో అమెజాన్ మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పోలిస్తే ఇప్పటికి తక్కువ యూజర్ బేస్ ను కలిగి ఉండడంతో, ఇప్పుడు మరోసారి ప్లాన్ రేట్స్ తగ్గించే యోచనలో పడినట్లు చెబుతున్నారు.
Also Read: 6 వేలకే 5.1 Dolby Soundbar కావాలా.. అయితే ఈ డీల్ మీకోసమే.!
అయితే, ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించే వరకు లీక్స్ గా మాత్రమే చూడాల్సి వస్తుంది. అయితే, నెట్‌ఫ్లిక్స్ యూజర్ బేస్ లో కనిపిస్తున్న డౌన్ ఫాల్ చూస్తుంటే మాత్రం ఈ లీక్స్ నిజం అయ్యే అవకాశం ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా అఫీషియల్ స్టేట్మెంట్ మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి, ఈ విషయం పై నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా స్పందించే వరకు మనం వేచిచుడాలి.