6 వేలకే 5.1 Dolby Soundbar కావాలా.. అయితే ఈ డీల్ మీకోసమే.!
కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ లో 5.1 Dolby Soundbar
ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న బిగ్ సౌండ్ బార్ డీల్
ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,300 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది
కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ లో 5.1 Dolby Soundbar కావాలా? అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ మీకోసమే వచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన బిగ్ బ్యాంక్ దివాళి సేల్ నుంచి ఈ ధమాకా సౌండ్ బార్ ఆఫర్స్ అందించింది. ఈ సేల్ నుంచి ఈరోజు మీ బడ్జెట్ ధరలోనే గొప్ప సౌండ్ అందించే బ్రాండెడ్ డాల్బీ సౌండ్ బార్ మీ సొంతం చేసుకోవచ్చు.
Survey5.1 Dolby Soundbar : ఆఫర్
Egate బ్రాండ్ నుంచి రీసెంట్ గా వచ్చిన Phantom 630D ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్స్ తో ఈ బడ్జెట్ ప్రైస్ లో లభిస్తుంది. డీల్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ ని 76% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది. అలాగే, ఈ సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,300 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది.
Egate 5.1 Dolby Soundbar : ఫీచర్స్
ఈగేట్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఫాంటమ్ 630D సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ బాస్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. మంచి సౌండ్ కోసం ఈ సౌండ్ బార్ లో ప్రత్యేకమైన చిప్ కూడా ఉందని కంపెనీ తెలిపింది. ఈ సౌండ్ బార్ మంచి డిజైన్ మరియు సింపుల్ సెటప్ కలిగి ఉంటుంది.

ఈగేట్ సౌండ్ బార్ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 540W టోటల్ సౌండ్ అవుట్ పుట్ తో జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 3 EQ మోడ్స్ కలిగి ఉంటుంది మరియు కంటెంట్ ను బట్టి సౌండ్ మోడ్ కి అనుకూలంగా ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: BSNL ధమాకా ఆఫర్: తక్కువ ఖర్చుతో 330 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇటీవల సరికొత్తగా లాంచ్ అయ్యింది మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile