PUBG మొబైల్ గేమ్ మత్తు : PUBG ఆడుతూ నీళ్లనుకుని యాసిడ్ తాగిన వ్యక్తి

PUBG మొబైల్ గేమ్ మత్తు : PUBG ఆడుతూ నీళ్లనుకుని యాసిడ్ తాగిన వ్యక్తి
HIGHLIGHTS

అదృష్టవశాత్తూ, ప్రస్తుతం వ్యక్తి కోలుకున్నాడు మరియు మార్చి 3 న అతని కుట్లు తొలిగించడంతో, ఇప్పుడు అతని పరిస్థితి మెరుగుపడింది.

PUBG ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఈ ఆటకు అంటుకుపోయేలా చేసింది. దీని మంచి రసవంతమైన ఆట తీరు దీనికి అంతగా దీని అతుక్కుపోయేలా చేసింది.  ఈ ఆటకి దాదాపుగా 30 మిలియన్లకు పైగా రోజువారీ యాక్టివ్ ప్లేయర్లను పొందింది. అయినప్పటికీ, ఇది భారతదేశంలో ఒక వ్యసనంలా మరియు ప్రజలకు అనేక  సమస్యలకు కారణమని పలుమార్లు దూషణకు గురయ్యింది. ఇప్పుడు కొత్తగా మరొక నింద మూటగట్టుకుంది. అదేమిటంటే,  మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక  25 ఏళ్ల వయస్సు గల వ్యక్తి ఈ ఆట ఆడుతున్నపుడ అనుకోకుండా మంచి నీరు అనుకుని యాసిడ్ను తగినట్లు తెలుస్తోంది. ఒక నివేదిక ప్రకారం, మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని, చింద్వారా ప్రాంతానికి చెందిన ఒక గుర్తుతెలియని వ్యక్తి తన ప్రాంగణంలో కూర్చుని, PUBG ను ఆడుతూ పూర్తిగా అందులో లీనమైపోయాడు. అతను పూర్తిగా ఆటలో మునిగిపోయాడు, ఆ సమయంలో అతను యాసిడ్ బాటిల్ను తీసుకొని దాన్ని నీళ్లనుకుని పొరపాటున తాగేశాడు.

ఈ సంఘటన దాదాపుగా ఒక నెల క్రితం జరిగిందని తెలుస్తోంది మరియు ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు, అక్కడ డాక్టర్ మమన్ గోగియా అతనికి  చికిత్స చేశాడు. అయితే, అతని పరిస్థితి విషమించడంతో  అతనిని  నాగపూర్ కు  తీసుకువెళ్ళారు, అయినాసరే అతని పరిస్థితి మెరుగుపడలేదు, ఇక వారు అతనిని తిరిగి తీసుకువచ్చారు. డాక్టర్ గోగియా అతనికి  ఆపరేషన్ చేశారు, "అతని కడుపులో అధికంగా పూతలు రావడంతో, నాగపూర్ లో కూడా అతని పరిస్థితి  మెరుగుపడకపోవడంతో, అతని కుటుంబం అతన్ని ఇక్కడకు తీసుకువచ్చింది. అతను కొద్ది రోజుల్లోనే దాదాపుగా  5-6 కిలోల బరువుతగ్గిపోయాడు." అదృష్టవశాత్తూ, ప్రస్తుతం రోగి కోలుకున్నాడు మరియు మార్చి 3 న అతని కుట్లు తొలిగించడంతో, ఇప్పుడు  అతని పరిస్థితి మెరుగుపడింది.

ఇక్కడ PUBG ఆడుతూ నీళ్లనుకుని యాసిడ్ తాగేంతవరు వచ్చేలా చేసినందుకు, ఈ నింద PUBG మోయాల్సివచ్చింది. వాస్తవానికి, ఇక్కడ PUBG గేమ్ లేక మరే ఇతర ఆప్స్ లను కారణంగా చూపించడం కంటే, స్మార్ట్ ఫోన్ వ్యసనం ఎక్కువ అయిందనిచిప్పోచ్చు. ఎందుకంటే, దీనికి ఉదాహరణగా అదే వ్యక్తిని గురించి చెప్పొచ్చు. అతనికి ఇంట ప్రమాదం జరిగినప్పటికీ,  చికిత్స పొందుతున్న సమయంలో కూడా ఆ వ్యక్తి  "తన ఫోన్" ను వెనక్కి తెచ్చుకున్నాడని, వైద్యుడు చెప్పడం గమనార్హం. అంతేకాదు, ఇక్కడ పరిగణించటానికి చాలా విషయాలు ఉన్నాయి. "చికిత్స సమయంలో, అతను తన ఫోన్ లో ఇతర ఆటలను ప్లే చేయడంలో బిజీగా ఉండేవాడు. ఇంకా, అతను గేమ్స్ ఆడని సమయంలో, అతను తన ఫోన్ లో సినిమాలు చూడటం వంటివి చేసేవాడు, " అని ఆ డాక్టర్ TOI కి చెప్పారు. ఆ డాక్టర్ యొక్క ప్రకటనను పరిశీలిస్తే, ఇక్కడ సమస్య PUBG వ్యసనం కాదు, కానీ స్మార్ట్ ఫోన్ వ్యసనం ఎక్కువగా ఉందని ఒప్పోకోవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ వ్యసనం నిజంగానే మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఒక అధ్యయనం ప్రకారం, ఇది భారతీయ టీనేజర్లలోఉండాల్సిన వ్యక్తిగత నైపుణ్యాలను  దెబ్బతీస్తుంది. అంతేకాదు, భారతీయ యువతపై గణనీయమైన ప్రతికూల ఆరోగ్య ప్రభావాన్ని మరియు హానికరమైన మానసిక ప్రభావాన్ని కలిగిస్తుంది. కంపెనీలు   తయారీచేస్తున్న ఫోన్లు మరియు వాటి  ఫోన్ల కోసం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ అన్ని కూడా, వాటిని అంటిపెట్టుకుండేలా చేయడంవలన, హానికరమైన ఆరోగ్య ప్రభావాలు చోటుచేసుకుంటున్నాయి . అందువల్ల, మీరు ఫోన్ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడుపుతున్నట్లయితే, మీరు దాని గురించి తెలుసుకోవడానికి  సహాయపడే ఉపకరణాలు కూడా ఉన్నాయి. మీ ఫోనుతో మీరు గడిపిన సమయాన్ని నియంత్రించడం కోసం సహాయపడే డిజిటల్ వెల్ బీయింగ్ ఆప్స్  ని చాలానే Google తన ప్లే స్టోరీలో అందిస్తోంది.  అనవసర సమయాల్లో  మీరు వీలైనంతవరకు మీ ఫోనుకు దూరంగా ఉండడం నీకు శ్రేయస్కరం.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo