5G లాంచ్ తరువాత 4G మొబైల్స్ ఎఫెక్ట్ అవుతాయా.!

5G లాంచ్ తరువాత 4G మొబైల్స్ ఎఫెక్ట్ అవుతాయా.!
HIGHLIGHTS

5G లాంచ్ తరువాత 4G మొబైల్స్ ఎఫెక్ట్ అవుతాయా

ఈప్రశ్న ఇప్పుడు ఇంటర్నెట్ లో ఎక్కువగా కనిపిస్తోంది

నెటిజన్లు ఎవరికి తోచిన సంధానం వారు చెబుతున్నారు

5G లాంచ్ తరువాత 4G మొబైల్స్ ఎఫెక్ట్ అవుతాయా అనే ప్రశ్న ఇప్పుడు ఇంటర్నెట్ లో ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాదు, 5G నెట్‌వర్క్ వస్తే 4G స్మార్ట్‌ఫోన్‌లు ఆగిపోతాయా? అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో ఎక్కువగా చక్కర్లు కొడుతోంది. దీనికి చాలా మంది నెటిజన్లు ఎవరికి తోచిన సంధానం వారు చెబుతున్నారు. అయితే, దీని గురించి ఎక్కువగా మదన పడవలసిన అవసరం లేదు. మరి వాస్తవాలు ఏమిటో, టెలికం కంపెనీలు వీటి గురించి ఏమి చెబుతన్నాయో చూద్దామా.

ఇంతకు ముందు 2జీ, 3జీ, 4జీ నెట్ వర్క్ లు ఒకదాని తరువాత మరొకటి తరువాతి తరంగా విడుదలయ్యాయి. ఇప్పుడు మనం చూడబోతున్న 5G అనేది 4G కి నెక్స్ట్ జెనరేషన్, అదే 5th జనరేషన్. పదేళ్ల క్రితంమే మనకు 4జీ సేవలు ప్రారంభమయునా కూడా 2G లేదా 3G సేవలు ఇంత వరకూ ఆగిపోలేదు. ఇదే విధంగా 5G నెట్ వర్క్ వచ్చినా కూడా 4G సర్వీసులు కొనసాగుతాయి.

5G గురించి కంపెనీలు ఏమి చెబుతున్నాయి?

అన్ని టెలికం కంపెనీలు కూడా ఏక కంఠంతో 5G నెట్ వర్క్ వచ్చినా 4G ఆగదని చెబుతున్నాయి. మీ పాత 4G ఫోన్ గురించి మీరు చింతించాల్సిన పనిలేదు, వాటిని నిశ్చింతగా కొనసాగించవచ్చు. ముందుగా, దేశంలోని 13 ప్రధాన నగరాల్లో 5G సేవలు ప్రారంభమవుతున్నాయి. ఈ సర్వీస్ దేశం మొత్తం విస్తరించడానికి చాలా సమయం పడుతుంది. అందుకే, 5G వస్తే 4G ఆగిపోతుంది లేదా స్పీడ్ తగ్గి పోతుందా? అనే ప్రశ్నలను ప్రజలు గుప్పిస్తున్నారు. అయితే నిజానికి ఇది పూర్తిగా అవాస్తవం. మీరు మీ 4G ఫోన్‌ని సురక్షితంగా ఉపయోగించవచ్చు. అయితే, మీరు 5G నెట్‌వర్క్ కోరుకుంటే మీరు 5G ఫోన్ కి మారడం తప్పనిసరి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo