ఈరోజు నుండి మొదలైన PUBG Mobile Club Open 2020 Fall Split రిజిస్ట్రేషన్
News

ఈరోజు నుండి మొదలైన PUBG Mobile Club Open 2020 Fall Split రిజిస్ట్రేషన్

Raja Pullagura  | పబ్లిష్ చేయబడింది 24 Jun 2020

PUBG Mobile Club Open 2020 Fall Split కోసం రిజిస్ట్రేషన్ జూన్ 24 నుండి అంటే ఈరోజునుండి తెరిచి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్లు, జూలై 12 వరకు తెరిచి ఉంటాయి. ఇది ఈ సంవత్సరం PUBG మొబైల్ క్లబ్ ఓపెన్ ఎడిషన్ యొక్క రెండవ లీగ్. ట్విట్టర్‌లో PUBG మొబైల్ యొక్క అధికారిక Esports హ్యాండిల్ ద్వారా ఈ ప్రకటన చేశారు.

PUBG మొబైల్ క్లబ్ ఓపెన్ కోసం స్ప్రింగ్ స్ప్లిట్ కోసం రిజిస్ట్రేషన్ జనవరిలో ప్రారంభమైంది. రిజిస్టర్డ్ జట్టును ప్రాంతాలుగా విభజించారు మరియు ప్రతి ప్రాంతంలో గెలిచిన జట్టు వరల్డ్ లీగ్, లేదా అమెరికా విషయంలో, PMPL అమెరికాస్ వరకు కొనసాగుతుంది. Fall Split విజేతలు స్ప్రింగ్ స్ప్లిట్ విజేతలతో చేరతారు, PUBG మొయిల్ క్లబ్ ఓపెన్ ఫైనల్ విజేతను ప్రకటిస్తుంది.

PUBG మొబైల్ క్లబ్ ఓపెన్ 2020 యొక్క Spring Split India Region ఫైనల్స్ ఫిబ్రవరిలో జరిగాయి. ఫైనల్‌లో 16 జట్లు పోటీపడ్డాయి, ఆ జట్లలో మొదటి 9 జట్లు వరల్డ్ లీగ్‌కు వెళ్తాయి. ఫైనల్‌ను Godlike గెలిచుకుంది.

ముందుగా, చైనాకు చెందిన Top Esports ఈ PUBG మొబైల్ క్లబ్ ఓపెన్ యొక్క మునుపటి ఎడిషన్‌ను గెలుచుకుంది. విజేతలు ట్రోఫీతో పాటు, $180,000 (సుమారు రూ. 1,23,89,00) గెలుచుకున్నారు. ఫైనల్స్‌లో ఉన్న ఏకైక భారత జట్టు, టీమ్ సోల్ 12 వ స్థానంలో నిలిచింది. అయితే, జట్టు సభ్యుడు మోర్టల్ PMCO వెబ్‌సైట్ ఫ్యాన్ ఫేవరెట్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు.

logo
Raja Pullagura

Web Title: PUBG Mobile Club Open 2020 Fall Split registration starting today
Tags:
pubg pubg mobile PUBG Mobile Club Open 2020 Fall Split PUBG Mobile Club Open 2020 పబ్జి పబ్జి మొబైల్

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

We are about leadership — the 9.9 kind Building a leading media company out of India. And, grooming new leaders for this promising industry

DMCA.com Protection Status