Save the Tigers Season 3 గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసిన జియో హాట్ స్టార్.. రిలీజ్ ఎప్పుడంటే.!

HIGHLIGHTS

Save the Tigers Season 3 సేవ్ ది టైగర్స్ ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చేందుకు రెడీ

ఈ సిరీస్ యొక్క ‘సీజన్ 3’ కోసం ఫన్నీ గ్లింప్స్ విడుదల చేసిన జియో హాట్ స్టార్

జియో హాట్ స్టార్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది

Save the Tigers Season 3 గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసిన జియో హాట్ స్టార్.. రిలీజ్ ఎప్పుడంటే.!

Save the Tigers Season 3: వైవాహిక జీవితంలో వచ్చే సరదా గొడవలు, అల్లరి ముచ్చట్లు మరియు అల్లరి గొడవలు, సూపర్ టైమింగ్ కామెడీతో నవ్వుల పువ్వులు పూయించి ప్రేక్షకులను అలరించిన “Save The Tigers” ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చేందుకు రెడీ అవుతోంది. సీజన్ 1 మరియు సీజన్ 2 సూపర్ హిట్ గా వెలిగించిన ఈ సిరీస్ యొక్క ‘సీజన్ 3’ కోసం జియో హాట్ స్టార్ విడుదల చేసిన ఫన్నీ గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి కూడా ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య ల త్రయం మళ్ళి కొత్త తిరిగి గందరగోళంతో వస్తున్నట్లు కొత్త గ్లింప్స్ వీడియో చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Save the Tigers Season 3: రిలీజ్ డేట్ ఏమిటీ?

జియో హాట్ స్టార్ లో రాబోతున్న ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ రిలీజ్ డేట్ ఇంకా రివీల్ చేయలేదు. అయితే, కమింగ్ సూన్ క్యాప్షన్ తో ఈ అప్ కమింగ్ సిరీస్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది. జియో హాట్ స్టార్ ప్లాట్ ఫామ్ మరియు జియో హాట్ స్టార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో ఈ సిరీస్ త్వరలో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసింది.

Save the Tigers Season 3

ఈ వీడియో నుండి గత రెండు సిరీస్ లో బాగా ఆకట్టుకున్న సీన్స్ కట్ మరియు అప్ సిరీస్ కామెడీ సీన్స్ గ్లింప్స్ సైతం రిలీజ్ చేసింది. కొత్త సిరీస్ మరింత కామెడీకి నాంది పలకబోతున్నట్లు కనిపిస్తోంది. గత రెండు సీజన్లలో మాదిరిగానే ఈసారి కూడా మ్యారీడ్ లైఫ్ మజిలీలో కొనసాగే చిన్న చిన్న అపార్థాలు, భార్యలతో భర్తల సమస్యలు అన్నీ కూడా మరింత ఫన్నీగా చూపించబోతున్నట్లు అర్థమవుతోంది.

Also Read: అండర్ రూ. 4,000 బడ్జెట్ లో జబర్దస్త్ సౌండ్ అందించే Soundbar డీల్స్ అందుకోండి.!

Save the Tigers Season 3: కొత్త గ్లింప్స్ ఏమి చెబుతోంది?

ఇక సీజన్ 3 కోసం అందించిన గ్లింప్స్ కొత్త సిరీస్ లో రాబోతున్న కొత్త ట్విస్టులు గురించి చెబుతోంది. ముఖ్యంగా ‘ఘంటా రవి’ MLA అవుతున్నాడని ఈ సిరీస్ లో సూచన ప్రాయంగా కనిపిస్తోంది. అంతేకాదు, వినోదంతో పాటు రాజకీయ సేటైర్‌ ను కూడా ఈ సీజన్‌లో చేర్చబోతున్నాయని మనకు ఈ గ్లింప్స్ చెబుతోంది. ఇది గత సిరీస్ కంటే మరింత కామెడీ మరియు రసవత్తరంగా కొనసాగవచ్చని కూడా అనిపిస్తుంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో సూపర్‌హిట్ అయిన సిరీస్ కావడంతో, మూడో సీజన్‌ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ అయితే, సీజన్ 3 ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందనే రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్ కోసం ప్రేక్షకులు ఇంకా మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo