900W హెవీ సౌండ్ తో Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేసిన Zebronics
Zebronics భారీ సౌండ్ అందించే 900W Dolby Atmos సౌండ్ బార్ ను విడుదల చేసింది
ఈ సౌండ్ బార్ వైర్ల బెడద లేని కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది
ఈ సౌండ్ బార్ ని చాలా ప్రీమియం డిజైన్ తో మరియు 7.1.2 సెటప్ తో లాంచ్ చేసింది
ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ Zebronics భారీ సౌండ్ అందించే 900W Dolby Atmos సౌండ్ బార్ ను విడుదల చేసింది. ఇటీవల 1100 వాట్స్ భారీ సౌండ్ అందించే Zeb Juke Bar 10000 సౌండ్ బార్ అందించిన జెబ్రోనిక్స్ ఇప్పుడు 900W సౌండ్ తో Zeb Juke bar 9920 సౌండ్ బార్ ను విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ వైర్ల బెడద లేని కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది. జెబ్రోనిక్స్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ సౌండ్ బార్ ధర మరియు పూర్తి వివరాలు తెలుసుకోండి.
SurveyZebronics 900W Dolby Atmos సౌండ్ బార్ ఫీచర్స్
జెబ్రోనిక్స్ Zeb Juke bar 9920 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ని గొప్ప ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ని చాలా ప్రీమియం డిజైన్ తో మరియు 7.1.2 సెటప్ తో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ మొత్తం 9 స్పీకర్లు కలిగి 540 W సౌండ్ అందించే బార్ మరియు 360 W హెవీ బాస్ సౌండ్ అందించే 12 ఇంచ్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ బార్ ఎన్నడూ లేని కొత్త స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో ముందు మూడు స్పీకర్లు, ఇరువైపులా రెండు స్పీకర్లు మరియు పైన నాలుగు స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇది ఫుల్ సరౌండ్ సౌండ్ సెటప్ కలిగి ఉంటుంది. అంటే, ఈ సౌండ్ బార్ సరౌండ్ సౌండ్ కోసం అవసరమైన శాటిలైట్ స్పీకర్లు ఇన్ బిల్ట్ గా కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలాజి విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో అందించిన AcoustiMax ఆడియో టెక్నాలజీ మరియు స్పీకర్ సెటప్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ ను తలదన్నే గొప్ప సౌండ్ అందిస్తుందని జెబ్రోనిక్స్ చెబుతోంది. ఇక కనెక్టివిటీ సపోర్ట్ విషయానికి వస్తే, HDMI (eARc), USB, AUX, ఆప్టికల్ ఇన్ మరియు బ్లూటూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: AI సత్తా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన గూగుల్ డీప్‌మైండ్ చీఫ్ సైంటిస్ట్ Jeff Dean
Zebronics 900W Dolby Atmos సౌండ్ బార్ : ప్రైస్
జెబ్రోనిక్స్ ఈ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ని రూ. 32,999 ధరతో విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ జెబ్రోనిక్స్ అఫీషియల్ సైట్, Amazon మరియు Flipkart నుంచి సేల్ అవుతుంది. ఈ సౌండ్ బార్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించాయి.