ZEBRONICS 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 7 వేలకే లభిస్తుంది.!
ఫ్లిప్ కార్ట్ రీసెంట్ గా ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అనౌన్స్ చేసింది
ZEBRONICS 5.1 Dolby సౌండ్ బార్ ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తుంది
ZEBRONICS 5.1 Dolby సౌండ్ బార్ డీల్ మరియు ఈ డీల్ వివరాలు చూడండి
ఫ్లిప్ కార్ట్ రీసెంట్ గా ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ డిసెంబర్ 21న ముగుస్తుంది. ఈ సేల్ నుంచి రెగ్యులర్ గా మంచి డీల్స్ ఆఫర్ చేయడం మేయు గమనించాము. ఈరోజు మేము మేము చూసిన ఒక బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను మీకోసం ఇక్కడ అందిస్తున్నాము. ఈ సౌండ్ బార్ రీసెంట్ గా సేల్ అయిన ధరతో పోల్చినా కూడా ఈరోజు ఆల్ టైమ్ చవక ధరలో మీకు లభిస్తుంది.
SurveyZEBRONICS 5.1 Dolby సౌండ్ బార్ : ఆఫర్స్
ZEBRONICS 5.1 Dolby సౌండ్ బార్ Juke Bar 9400 Pro ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఎన్నడూ చూడని చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో 10 వేల బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. వాస్తవానికి, రెండు రోజుల క్రితం కూడా ఈ సౌండ్ బార్ రూ. 8,499 రూపాయల ధరలో లిస్ట్ అయ్యింది. ఈరోజు మరింత తక్కువ ధరలో లభిస్తుంది.

ఈ సౌండ్ బార్ పై రూ. 799 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా మీరు పొందవచ్చు. ఎలాగంటే, మీరు ఈ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి BOB CARD EMI లేదా PNB క్రెడిట్ కార్డ్ లేదా HDFC లేదా HSBC క్రెడిట్ కార్డు తో చెల్లింపు చేసి కొనుగోలు చేస్తే ఈ అదనపు డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈ డిస్కౌంట్ ఆఫర్ తో మీకు కేవలం రూ. 7,200 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందుబాటులో ఉన్న ఈ సౌండ్ బార్ డీల్ ను బడ్జెట్ సౌండ్ బార్ కోసం చూసే వారు పరిశీలించవచ్చు.
Also Read: Sony Smart Tv పై ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ డీల్స్ అందుకోండి.!
ZEBRONICS 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 525W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటాప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఇది కంప్లీట్ వైర్డ్ సెటప్ కలిగి ఉంటుంది మరియు రియల్ టైమ్ సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. మీడియం సైజు హాల్ కోసాం ఈ సౌండ్ బార్ పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది.
ఇక ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఇది డాల్బీ ఆడియో మరియు డాల్బీ డిజిటల్ ప్లస్ 5.1 ఛానల్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ మీడియం సైజు హాల్ ను సైతం చేసే బాస్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.