Sony Smart Tv పై ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ డీల్స్ అందుకోండి.!
Sony Smart Tv పై ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ డీల్స్ అందుకోండి
55 ఇంచ్ BRAVIA 2M2 స్మార్ట్ టీవీ ఫోన్ పై గత 90 రోజుల్లో ఎన్నడూ చూడని భారీ డిస్కౌంట్
ఈ సోనీ టీవీ ఇది HDR10 మరియు HLG వంటి HDR ఫార్మాట్లకు సపోర్ట్ చేస్తుంది
Sony Smart Tv పై ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ డీల్స్ అందుకోండి. సోనీ లేటెస్ట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ BRAVIA 2M2 స్మార్ట్ టీవీ పై గత 90 రోజుల్లో ఎన్నడూ చూడని భారీ డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అమెజాన్ ఈరోజు అందించింది. అమెజాన్ ఈరోజు అందించిన ఈ బిగ్ సోనీ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో చూద్దామా.
SurveySony Smart Tv : అమెజాన్ డీల్
సోనీ లేటెస్ట్ స్మార్ట్ టీవీ సిరీస్ బ్రావియా 2M2 55 సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ K-55S25BM2 పై ఈ డీల్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ రీసెంట్ గా కూడా రూ. 62,992 ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు 90 రోజులు ఎన్నడూ చూడని విధంగా మంచి డిస్కౌంట్ తో రూ. 57,990 ధరలో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

అమెజాన్ అందించిన ఈ రెండు ఆఫర్స్ తో ఈ సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 56,490 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. సోనీ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ కోసం చూసే వారు ఈరోజు లభిస్తున్న ఈ డీల్ ని పరిశీలించవచ్చు. Buy From Here
Also Read: Google Pixel Update: అత్యవసరంగా కొత్త పిక్సెల్ యూజర్లకు కొత్త అప్డేట్ అందించిన గూగుల్.!
Sony Smart Tv : ఫీచర్స్
ఈ సోనీ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ LED ప్యానల్ కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ 4K UHD (3840 × 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ సోనీ టీవీ ఇది HDR10 మరియు HLG వంటి HDR ఫార్మాట్లకు సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ సోనీ యొక్క లేటెస్ట్ 4K Processor X1 మరియు 4K X-Reality PRO ఇంజిన్ కలయికతో కంటెంట్‌ను రియల్-టైమ్‌లో అప్ స్కెల్ స్కేల్ చేసి అందిస్తుంది. అందుకే, ఈ టీవిలో చూసే ప్రతి సన్నివేశం కూడా గొప్ప వివరాలు మరియు గొప్ప పిక్చర్ క్లారిటీతో ఉంటుంది. ఈ టీవీ కలిగిన MotionFlow XR 200 ఫీచర్ తో ఫాస్ట్ యాక్షన్ షాట్స్ కూడా స్మూత్‌గా చూడగలుగుతారు.
ఇక ఈ సోనీ స్మార్ట్ టీవీ సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ Dolby Atmos, DTS:X, DTS Digital Surround వంటి అధునాతన సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి వుంది. ఇందులో అందించిన రెండు ఓపెన్ బఫెల్ స్పీకర్ తో 20W సౌండ్ అందిస్తుంది. ఇది ఈ టీవీ అందించే సూపర్ క్వాలిటీ పిక్చర్ కి తగిన సూపర్ క్వాలిటీ సౌండ్ కూడా అందిస్తుంది.
ఈ సోనీ టీవీ 4 HDMI పోర్ట్ లు, 2 USB పోర్ట్స్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, Wi-Fi 6, ఆప్టికల్, బ్లూటూత్ మరియు LAN పోర్ట్ తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.