Truke Mega 9: లెథర్ ఫినిష్ మరియు 24bit లాస్ లెస్ ఆడియో బడ్స్ లాంచ్ చేసింది.!
ట్రూక్ ఈరోజు మార్కెట్లో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది
Truke Mega 9 ను ప్రీమియం లెథర్ ఫినిష్ డిజైన్ తో అందించింది
ఈ కొత్త ఇయర్ బడ్స్ ను గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో కూడా అందించింది
Truke Mega 9: ట్రూక్ ఈరోజు మార్కెట్లో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ ను ప్రీమియం లెథర్ ఫినిష్ డిజైన్ తో అందించింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ ను గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో కూడా అందించింది. ట్రూక్ సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్స్ చూద్దామా.
Truke Mega 9 : ప్రైస్
ట్రూక్ ఈ కొత్త బడ్స్ ను రూ. 1,299 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ బడ్స్ ను ఫస్ట్ కొనుగోలు చేసే 200 కస్టమర్లకు మాత్రం ఈ బడ్స్ ను కేవలం రూ. 999 రూపాయల ఆఫర్ ధరకే అందిస్తుందని ట్రూక్ చెబుతోంది. ఈ బడ్స్ మే 20 వ తేదీ నుండి సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ బడ్స్ అమెజాన్ ఇండియా మరియు ట్రూక్ అధికారిక వెబ్సైట్ నుంచి లభిస్తుంది.
Truke Mega 9 : ఫీచర్స్
ట్రూక్ ఈ బడ్స్ ను ప్రీమియం లెథర్ ఫినిష్ తో పెబల్ డిజైన్ లో అందించింది. ఈ ట్రూక్ లేటెస్ట్ బడ్స్ 13mm టైటానియం స్పీకర్లు కలిగి ఉంటాయి. దీనికి జతగా అందించిన 24 బిట్ లాస్ లెస్ స్పటియల్ ఆడియో సపోర్ట్ తో సినిమాటిక్ ఆడియో ఆఫర్ చేస్తుందని ట్రూక్ చెబుతోంది. ఇది కాకుండా ఈ బడ్స్ లో మంచి కాలింగ్ కోసం ప్యూర్ వాయిస్ ENC టెక్నాలాజి ఉందని కూడా ట్రూక్ తెలిపింది.
ఈ బడ్స్ ను ప్రతీ లైఫ్ స్టైల్ కు తగిన విధంగా ఫిట్ డిజైన్ కలిగి ఉంటుందని ట్రూక్ పేర్కొంది. ఈ బడ్స్ ఏకంగా 70 గంటల ప్లే టైమ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే, ఈ బడ్స్ సింగిల్ ఛార్జ్ లో ఎంత ప్లే టైమ్ అందిస్తుందో మాత్రం క్లియర్ గా వెల్లడించలేదు. ఈ బడ్స్ డ్యూయల్ డివైజ్ పెయిరింగ్ ఫీచర్ మరియు నోటిఫికేషన్ లైట్ ను కలిగి ఉంటుంది. ఈ బడ్స్ ను మూడు కలర్ ఆప్షన్ లతో అందిస్తుంది. ఈ బడ్స్ 1 సంవత్సరం వారంటీ కలిగి ఉంటుంది.
Also Read: Samsung Galaxy S25 ఫోన్ పై భారీ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన శామ్సంగ్.!
ఈ బడ్స్ ను కేవలం రూ. 999 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవాలనుకుంటే, మే 20వ తేదీ మొదలయ్యే మొదటి సేల్ నుంచి ముందు కొనుగోలు చేసే మొదటి 200 కస్టమర్లతో మీరు కూడా ఒకరై ఉండాలి.