Samsung Galaxy S25 ఫోన్ పై భారీ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన శామ్సంగ్.!
Samsung Galaxy S25 పై శామ్సంగ్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది
గెలాక్సీ S25 స్మార్ట్ ఫోన్ ను తక్కువ ధరకు అందుకునే అవకాశం
ఈ లేటెస్ట్ ఆఫర్స్ ను కేవలం ఒక నిర్దిష్ట టైమ్ పీరియడ్ కోసం మాత్రమే అందించింది
Samsung Galaxy S25 స్మార్ట్ ఫోన్ పై శామ్సంగ్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. అయితే, ఈ లేటెస్ట్ ఆఫర్స్ ను కేవలం ఒక నిర్దిష్ట టైమ్ పీరియడ్ కోసం మాత్రమే అందించింది. శామ్సంగ్ లేటెస్ట్ గా ప్రకటించిన ఈ కొత్త ఆఫర్స్ తో గెలాక్సీ S25 స్మార్ట్ ఫోన్ ను తక్కువ ధరకు అందుకునే అవకాశం అందించింది. శామ్సంగ్ కొత్తగా అందించిన ఈ లేటెస్ట్ ఆఫర్స్ మరియు వాటి వివరాలు తెలుసుకోండి.
SurveySamsung Galaxy S25: ఆఫర్స్
శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ నుంచి కొత్తగా విడుదల చేసిన Galaxy S25 బేసిక్ వేరియంట్ పై ఈ బిగ్ డీల్స్ అందించింది. ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 11,000 ఎక్స్ చేంజ్ బోనస్ లేదా రూ. 10,000 రూపాయల వరకు భారీ బ్యాంక్ అందుకునే అవకాశం శామ్సంగ్ అందించింది.
శామ్సంగ్ గెలాక్సీ S25 స్మార్ట్ ఫోన్ కొత్త 128GB వేరియంట్ ను రూ. 74,999 రూపాయల ధరతో లాంచ్ చేయగా, ఈ స్మార్ట్ ఫోన్ పై శామ్సంగ్ అందించిన ఆఫర్స్ తో దాదాపు రూ. 63,999 రూపాయల ఆఫర్ ధరకే ఈ ఫోన్ ను అందుకోవచ్చు. మీ పాత ఫోన్ ఎంత ధరకు ఎక్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది మరియు ఎంత బోనస్ దక్కుతుందో చెక్ చేసుకుంటే మీకే ఆశ్చర్యం కలగవచ్చు. అయితే, ఇది కేవలం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. ఈ ఆఫర్ కేవలం మే నెల చివరి తేదీ (మే 31) వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Also Read: OnePlus 13s: చేతిలో ఇమిడే కాంపాక్ట్ డిజైన్ మరియు పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది.!
Samsung Galaxy S25: ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ S25 స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Elite అల్ట్రా ఫాస్ట్ చిప్ సెట్ తో పని చేస్తుంది. దానికి జతగా 12GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను ఆర్మర్ అల్యూమినియం మెటల్ బాడీ మరియు పటిష్టమైన గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ జతగా అందించింది. ఈ ఫోన్ లో 6.2 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 50MP మెయిన్ + 10MP టెలిఫోటో + 12MP అల్ట్రా వైడ్ ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 12 MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ Bixby Vision, పోర్ట్రైట్ వీడియో, ప్రో వీడియో, 30x డిజిటల్ జూమ్ మరియు 8K అండ్ 4K వీడియో రికార్డ్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4000 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile