అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ రోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది. అందుకే కాబోలు ఈరోజు అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ లను అందించింది. అందులో సౌండ్ బార్స్ పైన మరింత ఆకర్షణీయమైన ఆఫర్లు అందించింది. ఈ విభాగంలో Sony 5.1 సౌండ్ బార్ పైన అమెజాన్ Prime Day సేల్ నుండి బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. మరి అమెజాన్ అందించింది ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పైన ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Prime Day Sony 5.1 సౌండ్ బార్ ఆఫర్
అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఈరోజు సోనీ బ్రాండ్ యొక్క 5.1 ఛానల్ సౌండ్ బార్ పైన గొప్ప డిస్కౌంట్ అందించింది. నిన్న మొన్నటి వరకు రూ. 17,999 రూపాయల ధరకు అమ్ముడైన సోనీ HT-S20R సౌండ్ బార్ ను ఈరోజు రూ. 3,000 భారీ డిస్కౌంట్ తో రూ. 14,989 రూపాయలకు ఆఫర్ చేస్తోంది.
ఈ సోనీ 5.1 ఛానల్ సౌండ్ బార్ కంప్లీట్ సెటప్ తో వస్తుంది. ఇందులో, 1 బార్ రెండు రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు ఒక సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 400W హెవీ సౌండ్ అందిస్తుంది మరియు పెద్ద హాల్ ను సైతం షేక్ చేస్తుంది.
Prime Day Sony 5.1 Soundbar Deal
ఈ సోనీ సౌండ్ బార్ USB, HDMI, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby Digital 5.1 సరౌండ్ సౌండ్ ని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ డిజిటల్ యాంప్లిఫైయర్ మరియు S-మాస్టర్ వంటి యాంప్లిఫైయర్ సెటప్ తో పని చేస్తుంది.
ఈ సౌండ్ బార్ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, 15 వేల ఉప బడ్జెట్ లో హెవీ సౌండ్ ను Dolby Audio సపోర్ట్ తో అందించే బెస్ట్ 5.1 సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile