లేటెస్ట్ LG UHD AI స్మార్ట్ టీవీ ల పైన Prime Day సేల్ నుంచి భారీ ఆఫర్లు ప్రకటించిన Amazon.!
లేటెస్ట్ LG UHD AI స్మార్ట్ టీవీ ల పైన Prime Day సేల్ నుంచి భారీ ఆఫర్లు
ఈరోజు నుంచి మొదలైన Amazon బిగ్ సేల్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది
ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 43 ఇంచ్, 50 ఇంచ్ మరియు 55 ఇంచ్ సైజు లలో లభిస్తుంది
లేటెస్ట్ LG UHD AI స్మార్ట్ టీవీ ల పైన Prime Day సేల్ నుంచి భారీ ఆఫర్లు ప్రకటించిన Amazon. ఈరోజు నుంచి మొదలైన ఈ అమెజాన్ బిగ్ సేల్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. వీటిలో ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ డీల్ కూడా ఒకటి. ఈరోజు ఎల్ జి యొక్క ఈ లేటెస్ట్ సిరీస్ స్మార్ట్ టీవీ ల పైన గొప్ప డిస్కౌంట్ తో పాటు భారీ బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
SurveyLG UHD AI Prime Day : ఆఫర్
ఎల్ జి లేటెస్ట్ UHD స్మార్ట్ టీవీ సిరీస్ UR7500PSC Series పైన ఈ డీల్స్ అందించింది. నిన్న మొన్నటి వరకు సేల్ అయిన రేటుకు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ డే నుండి లభిస్తున్న ఆఫర్ రేట్ లకు రూ. 2,000 నుంచి రూ. 4,000 రూపాయల వరకు వ్యత్యాసం వుంది. ఈ సిరీస్ నుండి అందించిన 43 ఇంచ్ 50 ఇంచ్ మరియు 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన ఈ డిస్కౌంట్ లను అందించింది. Buy From Here
అదనంగా, ఈ టీవీ లను ICICI మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో ప్రైమ్ డే సేల్ నుంచి కొనుగోలు ప్రైమ్ యూజర్లకు రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక ఈ టీవీ ఆఫర్ ధరల విషయానికి వస్తే, ఈ సిరీస్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ముందుగా రూ. 31,990 ధరతో సేల్ అయ్యేది. అయితే, ఈ టీవీ ఈరోజు సేల్ నుంచి రూ. 29,990 ధరకే లభిస్తోంది. Buy From Here
ఈ సిరీస్ యొక్క 50 ఇంచ్ టీవీని రూ. 3,000 డిస్కౌంట్ తో రూ. 38,990 ధరతో మరియు 55 ఇంచ్ టీవీని రూ. 4,000 డిస్కౌంట్ తో రూ. 40,990 రూపాయల ఆఫర్ ధరకు సేల్ చేస్తోంది. Buy From Here
Also Read: Prime Day Sale నుంచి OnePlus 12R అన్ని వేరియంట్స్ పైన భారీ ఆఫర్స్ అందుకోండి.!
LG UHD AI స్మార్ట్ టీవీ : ఫీచర్స్
ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 43 ఇంచ్, 50 ఇంచ్ మరియు 55 ఇంచ్ సైజు లలో లభిస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ WiFi, HDMI, USB బ్లూటూత్ మరియు ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ టీవీ α5 AI ప్రోసెసర్ 4K Gen6 తో పని చేస్తుంది మరియు ఇది WebOS స్మార్ట్ టీవీ. ఈ టీవీ HDR 10, ఫిల్మ్ మేకర్ మోడ్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.

ఈ టీవీ లో AI Sound (వర్చువల్ సరౌండ్ 5.1) సపోర్ట్ వుంది. అంతేకాదు, ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 20W సౌండ్ అందించే 2.0 Ch స్పీకర్ సెటప్ ను కూడా కలిగివుంది. ఈ టీవీ 5 సంవత్సరాల వరకు OS అప్గ్రేడ్ లను అందుకుంటుందని ఎల్ జి తెలిపింది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile