Sennheiser కొత్త ఇయర్ బడ్స్ ను హార్ట్ రేట్ మరియు బాడీ టెంపరేచర్ ట్రాకర్ తో లాంచ్ చేసింది.!
Sennheiser ఇండియన్ మార్కెట్లో కొత్త ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది
ఈ కొత్త ఇయర్ బడ్స్ ను హార్ట్ రేట్ మరియు బాడీ టెంపరేచర్ ట్రాకర్ తో లాంచ్ చేసింది
ఈ కొత్త ఇయర్ బడ్స్ ను Momentum Sport పేరుతో సెన్‌హైజర్ లాంచ్ చేసింది
ప్రపంచ ఆడియో ప్రొడక్ట్స్ దిగ్గజం Sennheiser ఇండియన్ మార్కెట్లో కొత్త ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ ను హార్ట్ రేట్ మరియు బాడీ టెంపరేచర్ ట్రాకర్ తో లాంచ్ చేసింది. ఈ కొత్త బడ్స్ కేవలం సౌండ్ ను అందించడానికి మాత్రమే కాకుండా హార్ట్ రేట్ ట్రాకర్ వంటి ఇతర పనులు కూడా చేస్తుంది. ఈ కొత్త ఇయర్ బడ్స్ ను Momentum Sport పేరుతో సెన్‌హైజర్ లాంచ్ చేసింది.
SurveySennheiser Momentum Sport: ఫీచర్స్
సెన్‌హైజర్ మూమెంటమ్ స్పోర్ట్ ఇయర్ బడ్స్ ను 10mm స్పీకర్స్ తో లాంచ్ చేసింది. వాస్తవానికి, ఈ ఇయర్ బడ్స్ ను కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2024) నుంచి ప్రకటించింది. ఇప్పుడు ఈ బడ్స్ ను మార్కెట్ లోకి తీసుకు వచ్చింది. సెన్‌హైజర్ ఈ ఇయర్ బడ్స్ ను వర్క్ అవుట్ చేసే సమయంలో కూడా చక్కగా ఫిట్ అయ్యే స్పోర్ట్స్ ఐడియల్ ఫిట్ తో అందించింది.

ఈ మూమెంటమ్ స్పోర్ట్స్ ఇయర్ బడ్స్ ను క్లియర్ సౌండ్ మరియు పవర్ ఫుల్ BASS అందించేలా సెన్‌హైజర్ సౌండ్ తో అందించింది. ఈ ఇయర్ బడ్స్ అడాప్టివ్ ANC సపోర్ట్ తో వస్తుంది మరియు సెక్యూర్ ఫిట్ తో ఎటువంటి రణగొణ ధ్వనులు లేకుండా ప్యూర్ సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ ను IP54 రేటింగ్ తో డస్ట్ మరియు స్వెట్ రెసిస్టెంట్ గా అందించింది.
ఈ బడ్స్ బ్లూటూత్ వెర్షన్ 5.2 తో వస్తుంది మరియు ఇందులో హార్ట్ రేట్ మరియు బాడీ టెంపరేచర్ ట్రాకర్ సపోర్ట్ కూడా వుంది. ఈ బడ్స్ SBC, AAC, aptX మరియు aptX అడాప్టివ్ ఆడియో కోడ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్స్ సింగల్ ఛార్జ్ తో 6 గంటల ప్లే బ్యాక్ ను అందిస్తుంది మరియు బాక్స్ తో కలిపి టోటల్ 24 గంటల ప్లే టైమ్ ఆఫర్ చేస్తుంది.
Also Read: Samsung Galaxy M35: 50MP ట్రిపుల్ కెమెరా, సూపర్ AMOLED తో రేపు లాంచ్ అవుతుంది.!
ఈ బడ్స్ టైప్ C మరియు Qi వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా వస్తాయి. ఈ బడ్స్ పోలార్ ఫ్లో యాప్ సపోర్ట్ తో వస్తుంది మరియు ఫిట్ నెస్, స్పోర్ట్స్ మరియు ఇతర యాక్టివిటీస్ కి అనుకూలంగా ఉంటుంది.
Sennheiser Momentum Sport: ప్రైస్
సెన్‌హైజర్ ఈ కొత్త మూమెంటమ్ స్పోర్ట్స్ బడ్స్ ని రూ. 25,999 రూపాయల ధరతో మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ బడ్స్ ను సెన్‌హైజర్ అధికారిక సైట్, Amazon మరియు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile