Samsung Galaxy M35: 50MP ట్రిపుల్ కెమెరా, సూపర్ AMOLED తో రేపు లాంచ్ అవుతుంది.!
Samsung Galaxy M35 రేపు ఇండియాలో విడుదల అవుతుంది
ఈ ఫోన్ ను 50MP ట్రిపుల్ కెమెరాతో లాంచ్ చేస్తుంది
ఈ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు కీలకమైన ఫీచర్లు ముందే తెలుసుకోండి
Samsung Galaxy M35: శామ్సంగ్ ప్రకటించిన శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో విడుదల అవుతుంది. ఈ ఫోన్ ను 50MP ట్రిపుల్ కెమెరా మరియు సూపర్ AMOLED వంటి మరిన్ని ఫీచర్ లతో మార్కెట్లో లాంచ్ చేస్తునట్లు శామ్సంగ్ చాలా కాలంగా ఆటపట్టిస్తోంది. రేపు విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు కీలకమైన ఫీచర్లు ముందే తెలుసుకోండి.
SurveySamsung Galaxy M35: లాంచ్
శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో విడుదల చేయబడుతుంది. ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదటి రోజైన జూలై 20 నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: Noise 4 headphone: బ్లూటూత్ 5.4 మరియు పెద్ద 70 గంటల ప్లేబ్యాక్ తో లాంచ్.!
Samsung Galaxy M35: కీలకమైన ఫీచర్లు
శామ్సంగ్ ఈ ఫోన్ యొక్క అన్ని కీలకమైన ఫీచర్స్ ను ముందే బయటపెట్టేసింది. గొప్ప కెమెరా సిస్టం తో వచ్చిన గెలాక్సీ M34 5జి ఫోన్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా తీసుకు వస్తున్న ఈ ఎం 35 ఫోన్ కూడా గొప్ప కెమెరా సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP వైడ్ యాంగిల్ మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. అలాగే, ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరాతో గొప్ప ఫోటోలు మరియు నైట్ ఫోటోగ్రఫీ ని కూడా ఆస్వాదించవచ్చు అని కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్ గెలాక్సీ సిగ్నేచర్ స్లీక్ డిజైన్ మరియు రౌండ్ కార్నర్ లతో వస్తుంది. ఈ ఫోన్ ను శామ్సంగ్ యొక్క లేటెస్ట్ బడ్జెట్ ప్రోసెసర్ Exynos 1380 తో అందిస్తుంది. ఈ ఫోన్ లో 1000 నిట్స్ బ్రైట్నెస్ కలిగిన ఇన్ఫినిటీ 0 స్క్రీన్ వుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు పటిష్టమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కలిగిన AMOLED డిస్ప్లే. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరచడానికి వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా వుంది. ఈ ఫోన్ ను 6000mAh హెవీ బ్యాటరీ మరియు 25 ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందిస్తుంది.
అంతేకాదు, ఈ ఫోన్ 4 జెనరేషన్ OS అప్గ్రేడ్ లను అందుకుంటుందని కూడా శామ్సంగ్ భరోసా ఇస్తోంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile