Realme Buds Clip: రియల్‌మీ ఈరోజు కొత్త స్మార్ట్ ఫోన్ రియల్‌మీ పి4 పవర్ మరియు రియల్‌మీ బడ్స్ క్లిప్ రెండు ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది. ఈ కొత్త బడ్స్ ను చాలా కంఫర్ట్ కలిగిన డిజైన్ మరియు జబర్దస్త్ సౌండ్ అందించే సెటప్ తో అందించింది. భారత మార్కెట్లో ఈరోజు సరికొత్తగా విడుదలైన ఈ రియల్‌మీ బడ్స్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
Realme Buds Clip: ప్రైస్
రియల్‌మీ బడ్స్ క్లిప్ ఇయర్ బడ్స్ ను సరికొత్త టైటానియం ఫిట్ డిజైన్ తో కేవలం రూ. 5,999 ప్రైస్ ట్యాగ్ తో అందించింది. ఫిబ్రవరి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఇయర్ బడ్స్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ బడ్స్ పై రూ. 500 రూపాయల అదనపు ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ బడ్స్ ను టైటానియం గోల్డ్ మరియు టైటానియం బ్లాక్ రెండు రంగుల్లో లాంచ్ చేసింది.
రియల్‌మీ బడ్స్ క్లిప్ ఇయర్ బడ్స్ ను ఇయర్ ఫిట్ అండ్ టైటానియం ఫిట్ డిజైన్ తో అందించింది. ఈ ఇయర్ బడ్స్ కేవలం 5.3 గ్రాములతో చాలా తేలికగా ఉంటుంది. ఈ బడ్స్ ను జస్ట్ చెవుల పైన క్లిప్ మాదిరిగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనం రెగ్యులర్ గా చూసే ఇయర్ ఫిట్ డిజైన్ మాదిరిగా కాకుండా కొత్తగా ఉంటుంది. ఈ బడ్స్ లో 11mm డ్యూయల్ మ్యాగ్నెట్ లార్జ్ యాంప్లిఫైడ్ స్పీకర్ కలిగి ఉంటుంది. ఇది రియల్‌మీ యొక్క ప్రత్యేకమైన నెక్స్ట్ బాస్ అల్గారిథం తో గొప్ప బాస్ తో కూడిన క్రిస్టల్ క్లియర్ సౌండ్ ను చెవుల వెలుపల అందిస్తుంది.
ఈ బడ్స్ కలిగిన 3D స్పేషియల్ ఆడియో సౌండ్ స్టేజి ఫీచర్ తో ఈ బడ్స్ మంచి సౌండ్ ఆఫర్ చేస్తుందని రియల్‌మీ చెబుతోంది. అంతేకాదు, సౌండ్ నేరుగా చెవులకు చేరుకునేలా సౌండ్ డైరెక్షనల్ టెక్ కూడా ఈ బడ్స్ లో ఉంది. ఈ బడ్స్ ను AI ENC డ్యూయల్ మైక్ తో అందించింది. ఇది మంచి లీనమయ్యే కాలింగ్ ఎక్స్ పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. ఈ బడ్స్ టోటల్ 36 గంటల ప్లే టైమ్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ లో AI ట్రాన్స్లేటర్ సపోర్ట్ ను కూడా రియల్‌మీ అందించింది.
ఇక కనెక్టివిటీ మరియు ఇతర ఫీచర్స్ చూస్తే, ఇందులో డ్యూయల్ డివైజ్ కనెక్షన్ 2.0, ల్యాప్ టాప్ మరియు మొబైల్ మధ్య స్విఫ్ట్ చేసే స్విఫ్ట్ పెయిర్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ బడ్స్ 45ms అల్ట్రా లో లెటెన్సీ తో కూడా వస్తుంది. ఇది IP55 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.