Realme Buds Air 7 Pro : సెగ్మెంట్ ఫస్ట్ AI ట్రాన్స్ లెటర్ ఫీచర్ కలిగిన బడ్స్ గా వస్తోంది.!
Realme Buds Air 7 Pro : రియల్ మీ అప్ బడ్స్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ రిలీజ్ చేసింది. ఈ అప్ కమింగ్ బడ్స్ సెగ్మెంట్ ఫస్ట్ AI ట్రాన్స్ లెటర్ గా వస్తున్నాయని కంపెనీ తెలిపింది. రియల్ మీ నిర్వహించనున్న అతిపెద్ద గ్లోబల్ ఈవెంట్ నుంచి Realme GT 7 Seeris స్మార్ట్ ఫోన్ లతో పాటు ఈ బడ్స్ కూడా లాంచ్ చేస్తోంది. ఈ బడ్స్ యొక్క కీలకమైన ఫీచర్స్ మరియు కలర్ వేరియంట్ వివరాలు కూడా రియల్ మీ టీజర్ పేజీ ద్వారా వెల్లడించింది.
SurveyRealme Buds Air 7 Pro : లాంచ్
భారత కాలమానం ప్రకారం మే 27వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరగనున్న అతిపెద్ద ఈవెంట్ నుంచి రియల్ మీ GT 7 సిరీస్ ఫోన్స్ మరియు బడ్స్ ఎయిర్ 7 ప్రో ని కూడా లాంచ్ చేస్తోంది. ఈ బడ్స్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన ఆన్లైన్ సేల్ పార్ట్నర్ అవుతుంది. అందుకే, ఈ అప్ కమింగ్ బడ్స్ యొక్క కీలకమైన ఫీచర్స్ కలిగిన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి తో టీజింగ్ చేస్తోంది.
Realme Buds Air 7 Pro : ఫీచర్స్
రియల్ మీ బడ్స్ ఎయిర్ 7 ప్రో ఇయర్ బడ్స్ ను సెగ్మెంట్ ఫస్ట్ AI Translator బడ్స్ గా పరిచయం చేస్తున్నట్లు రియల్ మీ తెలిపింది. అంటే, ఇది యూజర్ వాయిస్ ను రియల్ టైమ్ లో తర్జుమా చేసి అందిస్తుంది. ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ ఏకంగా 34 భాషల్లో తర్జుమా చేసే శక్తిని కలిగి కలిగి ఉంటుందని రియల్ మీ చెబుతోంది.
ఇక బడ్స్ ఎయిర్ 7 ప్రో సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ స్పీకర్ సెటప్ ఉంటుంది. ఈ బడ్స్ 11mm ఉఫర్ మరియు 6mm ట్వీటర్ స్పీకర్ లను కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ Hi-Res Audio మరియు LHDC సపోర్ట్ కలిగి హై ఫిడిలిటీ మరియు సూపర్ క్లియర్ సౌండ్ అందిస్తుందని రియల్ మీ వెల్లడించింది.

ఈ రియల్ మీ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ గరిష్టంగా 5000Hz నోయిస్ క్యాన్సిలేషన్ ఫ్రీక్వెన్సీ రేంజ్ మరియు గరిష్టంగా 53 dB వరకు ANC (నోయిస్ క్యాన్సిలేషన్ డెప్త్) కలిగి ఉంటుంది. అంటే, బయట నుంచి వచ్చే శబ్దాలను 53 dB వరకు అడ్డుకుంటుంది. తద్వారా, యూజర్ చెవులకు క్లియర్ సౌండ్ అందించే వీలుంటుంది.
Also Read: Google Beam: AI 3D వీడియో కమ్యూనికేషన్ తో రియల్ లైఫ్ వీడియో ఫీచర్ తెచ్చిన గూగుల్.!
ఈ బడ్స్ సెగ్మెంట్ ఫస్ట్ ఏవియేషన్ అల్యూమినియం డిజైన్ ఇయర్ బడ్స్ గా ఉంటాయని కూడా రియల్ మీ పేర్కొంది. ఈ బడ్స్ ఫ్లాగ్ షిప్ మెటాలిక్ టెక్స్చర్ లో రెండు రంగులు మరియు ప్రీమియం లెథర్ టెక్స్చర్ లో రెండు రంగుల్లో లభిస్తుంది. ఇది రేసింగ్ గ్రీన్, మెటాలిక్ గ్రే, ఫైరీ రెడ్ మరియు గ్లోరీ బీజీ నాలుగు రంగుల్లో లభిస్తుంది.