Google Beam: AI 3D వీడియో కమ్యూనికేషన్ తో రియల్ లైఫ్ వీడియో ఫీచర్ తెచ్చిన గూగుల్.!
గూగుల్ నిర్వహించిన అతిపెద్ద ఈవెంట్ నుంచి కొత్త అప్డేట్ అందించింది
Google Beam కొత్త టెక్నాలాజి వివరాలు కూడా అందించింది
కొత్త టెక్నాలజీ గూగుల్ బీమ్ ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది
Google Beam: గూగుల్ నిర్వహించిన అతిపెద్ద ఈవెంట్ నుంచి కొత్త అప్డేట్, ఫీచర్స్ మరియు కొత్త టెక్నాలాజి వివరాలు కూడా అందించింది. ఈ ఈవెంట్ నుంచి అందించిన కొత్త టెక్నాలజీ లలో గూగుల్ బీమ్ ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే, ఈ కొత్త టెక్నాలజీ మానవాళికి ఉపయోగకరమైన వర్చువల్ రియాలిటీ వీడియో ఇంటరాక్షన్ కు సహాయం చేస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ గురించి గూగుల్ విపులంగా వివరాలు వెల్లడించింది.
SurveyGoogle Beam:
వీడియో కమ్యూనికేషన్ రంగంలో గణనీయమైన మార్పు కోసం గూగుల్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించిన Project Starline రీసెర్చ్ ద్వారా ఈ కొత్త అద్భుతాన్ని సాధించడం వీలైనట్లు గూగుల్ తెలిపింది. అదే, గూగుల్ బీమ్ మరియు ఈ కొత్త టెక్నాలజీ తో నిజ జీవిత వీడియో కమ్యూనికేషన్ సాధ్యం చేసింది. అంటే, ఎటువంటి వర్చువల్ గ్లాసెస్ లేదా హెడ్ సెట్ అవసరం లేకుండా ఒకే రూమ్ లో ఉన్నట్టు మరియు నిజమా లేక భ్రమ అనిపించే రీతిలో వీడియో కమ్యూనికేషన్ చేయడానికి వీరులు కల్పిస్తుంది.
టెక్నాలజీ పరిభాషలో కాకుండా వాడుక భాషలో అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలంటే, ఎటువంటి అదనపు పరికరాలు అవసరం లేకుండా ఎదుటి వ్యక్తి మన ముందే ఉన్నట్లు చూపించే కొత్త కాలింగ్ టెక్నాలాజి తీసుకు వచ్చింది. ఇది AI సహాయంతో 3D వీడియో కాలింగ్ గా మీకు అందిస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ 2D వీడియో స్ట్రీమింగ్ ను 3D గా మార్చి రియల్ లైఫ్ అనుభూతిని అందిస్తుంది.
గూగుల్ బీమ్ అనేది గూగుల్ క్లౌడ్ పవర్ మరియు పరిణామాన్ని ఆధారం చేసుకొని బిల్డ్ చేయబడుతుంది. ఇది ట్రూ టు లైఫ్ 3D వీడియో కమ్యూనికేషన్ అందిస్తుంది.
Also Read: LG Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి.!
Google Beam: ఎప్పుడు వస్తుంది
గూగుల్ బీమ్ ను ఇంటర్ ప్రైజ్ చేయడానికి ఇండస్ట్రీ లీడింగ్ కంపెనీలైన Zoom మరియు HP తో కలిసి పని చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. అంతేకాదు, త్వరలోనే ఈ టెక్నాలజీ తో కొత్త డివైజ్ లను తీసుకుని రాబోతున్నట్లు గూగుల్ తెలిపింది. అంతేకాదు, ఈ గూగుల్ బీమ్ వచ్చే మొదటి డివైజ్ HP నుంచి వచ్చే అవకాశం ఉందని కూడా గూగుల్ తెలిపింది.