Oppo Enco Air 5: కొత్త బడ్స్ ను స్మార్ట్ బ్లూటూత్ తో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో తెలిపింది.!

HIGHLIGHTS

ఒప్పో రెనో 16 సిరీస్ తో పాటు అప్ కమింగ్ బడ్స్ లాంచ్ గురించి కూడా కన్ఫర్మ్ చేసింది

ఈ అప్ కమింగ్ బడ్స్ డిజైన్ మరియు కొన్ని కీలక వివరాలు కూడా టీజర్ ద్వారా వెల్లడించింది

ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ గురించి చెబుతున్న కొత్త సంగతులు

Oppo Enco Air 5: ఒప్పో రెనో 16 సిరీస్ తో పాటు అప్ కమింగ్ బడ్స్ లాంచ్ గురించి కూడా కన్ఫర్మ్ చేసింది. అదే ఒప్పో ఎన్కో ఎయిర్ 5 ఇయర్ బడ్స్ మరియు ఈ అప్ కమింగ్ బడ్స్ డిజైన్ మరియు కొన్ని కీలక వివరాలు కూడా టీజర్ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే ఎన్కో సిరీస్ నుంచి మంచి ఫీచర్స్ తో చాలా ఇయర్ బడ్స్ అందించిన ఒప్పో, ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ గురించి చెబుతున్న కొత్త సంగతులు ఏమిటో చూద్దాం.

Oppo Enco Air 5 లాంచ్ డేట్

ఒప్పో రెనో 16 సిరీస్ తో పాటు ఈ అప్ కమింగ్ ఒప్పో ఎన్కో ఎయిర్ 5 ఇయర్ బడ్స్ లాంచ్ చేస్తుంది. అయితే, ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ మరియు స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఈ డివైజెస్ ను త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు ఒప్పో ప్రకటించింది.

Oppo Enco Air 5 : ఫీచర్స్

ఒప్పో ఎన్కో ఎయిర్ 5 ఇయర్ బడ్స్ ను ఎన్కో సిరీస్ నుంచి ముందు అందించిన ఓవెల్ డిజైన్ బాక్స్ తో అందిస్తుంది. అయితే, ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ మరింత తేలికగా ఉంటాయని ఒప్పో తెలిపింది. ఒప్పో ఎన్కో ఎయిర్ 5 ఇయర్ బడ్స్ కేవలం కేవలం 4.3 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటాయి. ఒప్పో ముందుగా అందించిన ఇయర్ బడ్స్ కంటే కూడా ఈ బడ్స్ చాలా తేలికైన బడ్స్ గా ఉంటాయుట. అంతేకాదు, చాలా కంఫర్ట్ ఫిట్ డిజైన్ తో ఆకట్టుకుంటాయని కూడా ఒప్పో తెలిపింది.

ఈ బడ్స్ ను డ్యూయల్ కనెక్షన్ సపోర్ట్ తో అందిస్తుంది. అంటే, ఒకే సమయంలో రెండు డివైజెస్ ను హ్యాండిల్ చేసే శక్తి కలిగి ఉంటుంది. అంతేకాదు, iOS మరియు ఆండ్రాయిడ్ రెండు డివైజ్ ల మధ్య కూడా అంతరాయం లేని క్రాస్ డివైజ్ ఫీచర్ ని కూడా ఎంజాయ్ చేయవచ్చు.

Also Read: Nothing Phone 4(b): అనుకోకుండా కొత్త ఫోన్ రూపొందించినట్లు కొత్త సిరీస్ గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన నథింగ్.!

ఈ ఇయర్ బడ్స్ ను లేటెస్ట్ బ్లూటూత్ 6.1 మరియు స్మార్ట్ బ్లూటూత్ ఫీచర్ తో అందిస్తున్నట్లు ఒప్పో తెలిపింది. ఈ ఫీచర్ తో ఈ బడ్స్ కనెక్ట్ చేసిన డివైజ్ తో చాలా స్ట్రాంగ్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు, గొప్ప గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం లో లెటెన్సీ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ స్పీకర్ మరియు ఇతర ఫీచర్స్ కూడా ఒప్పో త్వరలో వెల్లడిస్తుంది. ఈ అప్ కమింగ్ బడ్స్ డీసెంట్ డిజైన్ మరియు ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :