Nothing Phone 4(b): అనుకోకుండా కొత్త ఫోన్ రూపొందించినట్లు కొత్త సిరీస్ గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన నథింగ్.!
నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఈరోజు అనౌన్స్ చేసింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఒక షాకింగ్ మేటర్ కూడా ఒకటి బయట పెట్టింది
కొత్త సిరీస్ గురించి షాకింగ్ న్యూస్ చెప్పింది నథింగ్
Nothing Phone 4(b): UK బెస్ట్ స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఈరోజు అనౌన్స్ చేసింది. కేవలం లాంచ్ డేట్ మాత్రమే కాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఒక షాకింగ్ మేటర్ కూడా ఒకటి బయట పెట్టింది. ఫోన్ 4(a) సిరీస్ నుండి కొత్త ఫోన్ కోసం జరుగుతున్న ప్రోసెస్ లో అనుకోకుండా కొత్త ఫోన్ రూపొందించినట్లు కొత్త సిరీస్ గురించి షాకింగ్ న్యూస్ చెప్పింది నథింగ్.
SurveyNothing Phone 4(b): రిలీజ్ డేట్
నథింగ్ ఫోన్ 4 (బి) స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను జూలై 7వ తేదీ కి సెట్ చేసింది నథింగ్. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డేట్ ను ఈరోజు కంపెనీ ఇండియా అఫీషియల్ X హ్యాండిల్ నుంచి షేర్ చేసింది. ఈ అప్ కమింగ్ కోసం అందించిన టీజర్ నుంచి ఈ ఫోన్ యొక్క ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా కూడా ప్రత్యేకంగా టీజింగ్ చేసింది.
Nothing Phone 4(b): షాకింగ్ న్యూస్ ఏమిటి?
నథింగ్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ నుంచి అందించిన లేటెస్ట్ ట్వీట్ నుంచి ఈ షాకింగ్ న్యూస్ రివీల్ చేసింది. అదేమిటంటే, “Phone (4a) సిరీస్ కు సంబంధించిన స్కెచ్ లు వేస్తూ ఉండగా, పొరపాటున ఒక కొత్త ఫోన్ ను రూపొందించాము” అని ఈ కొత్త సిరీస్ గురించి పేర్కొంది. అంతేకాదు, ఈ ఏఏపీ కమింగ్ సిరీస్ కోసం అందించిన టీజర్ లో ఈ ఫోన్ కోసం వేసిన స్కెచ్ లను కూడా రిలీజ్ చేసింది.

కంపెనీ ట్వీట్ ప్రకారం, ఈ అప్ కమింగ్ నథింగ్ ఫోన్ స్కెచ్ లో ఏది చూసినా పెద్ద కెమెరా సెటప్, రౌండ్ కార్నర్ మరియు ప్రత్యేకమైన Ai బటన్ వంటి ఫీచర్స్ కనిపిస్తున్నాయి. ఇక కంపెనీ రిలీజ్ చేసిన స్కెచ్ డిజైన్ డీకోడ్ చేస్తే, ఫ్లాట్ ఎడ్జ్ ఫ్రేమ్, పైకి లేచిన కెమెరా బంప్ మరియు నథింగ్ సిగ్నేచర్ పారదర్శక (Transparent) ను పోలిన కొత్త డిజైన్ ఉన్నట్లు అర్ధం అవుతుంది.
Also Read: Samsung Galaxy M47 5G: పెర్ఫార్మన్స్ మరియు మన్నిక ప్రధానంగా లాంచ్ అవుతోంది.!
అయితే, ఇది ఫైనల్ డిజైన్ అని కంపెనీ నుంచి క్లియర్ డిటైల్స్ రాలేదు కాబట్టి ఈ ఫోన్ వివరాలు అఫీషియల్ గా రివీల్ చేసే వరకు కచ్చితంగా చెప్పలేం. నథింగ్ ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది కాబట్టి ఈ ఫోన్ యొక్క కీలక ఫీచర్లు కూడా ఒక్కొక్కటిగా రివీల్ చేస్తుంది. ఈ ఫోన్ కొత్త అప్డేట్ తో మీ ముందుకు వస్తాం.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
